బహుముఖ ప్రజ్ఞ.. ఎంత ఎదిగినా అందరికీ బాలూ!

బహుముఖ ప్రజ్ఞ.. ఎంత ఎదిగినా అందరికీ బాలూ!
x

SP Balasubramaniam

Highlights

Intresting Facts About SP Balasubramaniam : తెలుగు సినిమా పాట అంటే అందులో సగం అయన గురించే చెప్పాలి.. 1966లో ఓ పాట మొదలైన అయన ప్రయాణం ఎక్కడికో వెళ్ళిపోయింది. అయన తర్వాత ఎంతో మంది గాయకులూ వచ్చారు.. వస్తూనే ఉన్నారు..

Intresting Facts About Sp Balasubramaniam : తెలుగు సినిమా పాట అంటే అందులో సగం అయన గురించే చెప్పాలి.. 1966లో ఓ పాట మొదలైన అయన ప్రయాణం ఎక్కడికో వెళ్ళిపోయింది. అయన తర్వాత ఎంతో మంది గాయకులూ వచ్చారు.. వస్తూనే ఉన్నారు.. అందరకి అయన స్ఫూర్తి.. ఏడుపదుల వయసులో కూడా ఎంతో యాక్టివ్ అయన తన గాత్రంతో అలరించారు.. ఆ పాట అంటే ఆయనే పాడాలి.. అయన పాడితే ఈ పాట ఆయన కోసమే పుట్టిందా అన్నట్టుగా ఉంటుంది.. దాదాపుగా 40వేలకి పైగా పాటలు పాడి చాలా మంది అభిమానులకి సొంతం చేసుకున్నారు. ఆయనే ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం.. అందరు ముద్దుగా పిలిచే ఎస్పీ బాలు.. గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న అయన ఈ రోజు తిరిగిరాని లోకాలకి వెళ్ళిపోయారు..

ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. 1946 జూన్ 4న నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించారు పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.. తండ్రి సాంబమూర్తి, తల్లి శకుంతలమ్మ. వీరికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు.. ఇందులో బాలసుబ్రహ్మణ్యం వీరికి రెండవ కుమారుడుగా జన్మించాడు.

2. చిన్నప్పటి నుంచి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం ఉన్న బాలుకి మొదటిసారిగా 1966 లో నటుడు, నిర్మాత అయిన పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో సినీ గాయకుడిగా ఆయన ప్రస్థానం ప్రారంభమైంది. ఈ సినిమాకి ఎస్.పి.కోదండపాణి సంగీత దర్శకుడు..

3. మొదట్లో ఎస్పీ బాలుకి ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవాడు. అందుకే అమరగాయకుడు ఘంటసాల తరువాత తెలుగు సినీ పాటకు సిసలైన వారసుడిగా ఎస్పీ బాలు నిలిచారు.

4. శంకరాభరణం, సాగరసంగమం లాంటి పాటలు పాడుతూనే రొమాంటిక్ లవ్ సాంగ్స్ పాడుతుండేవారు బాలు...

5. కేవలం గాయకుడిగా మాత్రమే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా, సంగీత దర్శకుడిగా కూడా మెప్పించారు బాలు.. ఆయన తొలిసారిగా మన్మధలీల సినిమాకి గాను కమల్ హాసన్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పాడు. ఆ తర్వాత కమల్ తో పాటుగా జనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ మొదలగు వారికి గాత్రదానం చేశారు.

6. ఇక బాలు మొదటిసారిగా 1969లో వచ్చిన "పెళ్ళంటే నూరేళ్ళ పంట" అనే చిత్రంలో మొదటిసారిగా నటుడిగా కనిపించాడు బాలు. ఇక 1990 లో తమిళంలో వచ్చిన కేలడి కన్మణి అనే చిత్రంలో మొదటిసారిగా హీరోగా నటించారు. ఇందులో రాధిక హీరోయిన్ గా నటించింది. ఇదే సినిమాని తెలుగులో ఓ పాప లాలీ అనే పేరుతో అనువాదం చేశారు.. ఇక సహాయనటుడుగా ప్రేమికుడు, పవిత్రబంధం, దీర్ఘ సుమంగళీ భవ సినిమాలో నటించారు.. ఇక తనికెళ్ళ భరణి దర్శకత్వంలో వచ్చిన మిథునం సినిమాలో అయన మెయిన్ లీడ్ లో నటించారు. ఇక దాదాపుగా 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించారు బాలు..

7. ఆయన సేవలకి గాను భారత ప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసింది.. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 29 సార్లు వివిధ విభాగాల్లో అయన నంది పురస్కారం అందుకున్నాడు. ఇంకా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రప్రభుత్వాల నుంచి కూడా పలు పురస్కారాలు అందుకున్నాడు. 2012 లో ఆయన నటించిన మిథునం సినిమాకు గాను నంది ప్రత్యేక బహుమతి లభించింది.

8. తనకు సినీ గాయకునిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని అతని పేరే పెట్టుకున్నాడు బాలు.

9. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాటలు పాడారు.. 2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో అతనికి శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని ప్రదానం చేసారు.

10. 2010లో కమల్ హాసన్ కథానాయకుడిగా వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది.

11. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పాడు. ఈ రెండు చిత్రాలకు ఆయనకు ఉత్తమ డబ్బింగ్ కళాకారుడిగా నంది పురస్కారం లభించింది.

12. ఈటీవీలో పాడుతా తీయగా అనే కార్యక్రమంతో బాలసుబ్రహ్మణ్యం బుల్లితెర ప్రవేశం చేసాడు. అనేక మంది కొత్త గాయనీ గాయకులను ఈ కార్యక్రమం ద్వారా పరిచయం చేసాడు. 1996 లో మొదలైన ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతూనే ఉంది.

13. అత్యధిక పాటలు రికార్డు చేసిన గాయకుడిగా ఆయన పేరిట ఒక రికార్డు ఉంది ఆయన సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది.

14. ఇక బాలుకు సావిత్రితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. పల్లవి, ఎస్పీ చరణ్. చరణ్ కొన్ని సినిమాల్లో పాటలు పాడి, ఆ తర్వాత సినీ నిర్మాతగా, నటుడిగా మారాడు. ఇక బాలు సోదరి ఎస్. పి. శైలజ కూడా సినీ నేపథ్య గాయని. డబ్బింగ్ కళాకారిణి.. ఈమె బాలుతో, చరణ్ తో కలిసి పలు చిత్రాల్లో పాటలు పాడింది.

Show Full Article
Print Article
Next Story
More Stories