ఇండియా నుంచి మొదటి ఆస్కార్ అందుకున్న మహిళ మృతి

ఇండియా నుంచి మొదటి ఆస్కార్ అందుకున్న మహిళ మృతి
x
Highlights

ఇండియా నుంచి ఫస్ట్ ఆస్కార్ దక్కించుకున్న భాను అతైయ్యా ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని నివాసంలో కన్నుమూశారు. 1983లో...

ఇండియా నుంచి ఫస్ట్ ఆస్కార్ దక్కించుకున్న భాను అతైయ్యా ఇక లేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని నివాసంలో కన్నుమూశారు. 1983లో వచ్చిన గాంధీ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన భాను ఆ చిత్రానికి ఆస్కార్ అందుకున్నారు. సౌత్ ముంబైలోని చందన్‌వాడిలో రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎనిమిదేళ్ల క్రితం భాను బ్రెయిన్‌లో ట్యూమర్ గుర్తించగా చికిత్స అందిస్తూ వస్తున్నారు. ఇక ఆమె అసలు పేరు భానుమతి అన్నాసాహెబ్ రాజోపధ్యాయ్ కాగా సినిమాల్లోకి వచ్చాక భాను అతైయ్యాగా మార్చుకున్నారు. దాదాపు వంద సినిమాలకు పైగా ఆమె కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories