AR Rahman : ఏఆర్ రెహమాన్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు!

AR Rahman  : ఏఆర్ రెహమాన్ కు మద్రాసు హైకోర్టు నోటీసులు!
x

AR Rahman 

Highlights

AR Rahman : మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ కి మద్రాసు హై కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి

AR Rahman : మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ కి మద్రాసు హై కోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది.. పన్ను ఎగవేత కేసుకు సంబంధించి ఆదాయపు పన్ను అధికారులు దాఖలు చేసిన వ్యాజ్యంపై తమకు సమాధానం ఇవ్వాలని అందులో పేర్కొంది.. ఇంతకీ ఎం జరిగిందంటే.. 2012 లో రెహమాన్ తో బ్రిటన్‌కు చెందిన లిబ్రా మొబైల్స్ కంపెనీతో మూడేళ్ళు ఒప్పందం కుదురుచుకుంది.. ఒప్పందం ప్రకారం, రెహమాన్ మూడు సంవత్సరాల కాలానికి కంపెనీకి ప్రత్యేకమైన రింగ్‌టోన్‌లను కంపోజ్ చేయాల్సి ఉంది.

దీనికి గాను తన వేతనాన్ని నేరుగా తన ఛారిటబుల్ ట్రస్ట్‌కు చెల్లించాలని రెహమాన్ కంపెనీకి సూచించాడని ఐటి విభాగం పేర్కొంది. అయితే దీనిని ఆదాయంగా చూపకుండా రెహమాన్ ట్రస్టుకి బదిలీ చేశారని రెహమాన్ పై ఆదాయపు పన్ను అధికారులు కేసును నమోదు చేశారు. తీసుకున్న పారితోషికాని సంబంధించి పన్ను కట్టకుండా ఎగవేతకు పాల్పడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపైనే మద్రాస్ హైకోర్టు రెహమాన్ కి నోటీసులు జారీ చేసింది. దాఖలు చేసిన వ్యాజ్యంపై వివరణ ఇవ్వాలని కోరింది..

అయితే పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని రెహమాన్ నేరుగా స్వీకరించి, పన్ను చెల్లింపు తర్వాత ట్రస్టుకు బదిలీ చెయ్యాల్సి ఉంటుంది. కానీ పన్ను చెల్లించకుండా ఉండేందుకు నేరుగా రెహమాన్ చారిటబుల్ ట్రస్ట్ కు ఆదాయాన్ని బదిలీ చేయాలని చెప్పి పన్ను ఎగరవేశారు అంటూ అధికారులు పేర్కొన్నారు .

Show Full Article
Print Article
Next Story
More Stories