నేను హైద్రాబాద్ లోనే ఉన్నా: రామ్ గోపాల్ వర్మ

Iam stay in Hyderabad says Ramgopal varma
x

 నేను హైద్రాబాద్ లోనే ఉన్నా: రామ్ గోపాల్ వర్మ

Highlights

తాను ఎక్కడికీ పారిపోలేదని సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు.

తాను ఎక్కడికీ పారిపోలేదని సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఈ మేరకు గురువారం ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. చట్టాన్ని గౌరవిస్తానని ఆయన తెలిపారు.ఎప్పటి మాదిరిగానే మీడియా హైడ్రామా క్రియేట్ చేసిందని ఆయన ఆరోపించారు. తన కోసం పోలీసులు ఇతర రాష్ట్రాల్లో వెతుకుతున్నారని ఆయన చెప్పారు. కానీ, తాను మాత్రం హైద్రాబాద్ లోనే ఉన్నానని ఆయన తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని రామ్ గోపాల్ వర్మపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో 9 కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఈ నెల 11న కేసు నమోదైంది. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసుల విచారణకు ఆయన హాజరుకాలేదు. నాలుగు రోజులుగా ఆయన పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అయితే తాను షూటింగ్ లో ఉన్నందున పోలీసుల విచారణకు హాజరుకాలేకపోయినట్టుగా వర్మ చెబుతున్నారు.

ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ పిటిషన్లు

సోషల్ మీడియాలో పోస్టులపై తనపై కేసులు నమోదు చేయడంపై రామ్ గోపాల్ వర్మ ఏపీ హైకోర్టులో ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై కేసులు నమోదు చేయకుండా ఆదేశించాలని ఆ పిటిషన్ లో కోరారు. ఇప్పటివరకు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరారు. అయితే ఈ పిటిషన్ పై అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టును కోరారు. దీంతో విచారణ డిసెంబర్ 2కు వాయిదా పడింది. మరోవైపు ఇప్పటివరకు నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

వర్చువల్ గా విచారణకు హాజరుకు సిద్దమే

వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు రామ్ గోపాల్ వర్మ సిద్దంగా ఉన్నారని ఆయన తరపు న్యాయవాది గురువారం నాడు మీడియాకు చెప్పారు. వర్మ ఎక్కడికి పారిపోలేదని ఆయన చెప్పారు. మీడియాకు వీడియోలు పంపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories