Sri Tej: శ్రీతేజ్ కుటుంబానికి ఇప్పటి వరకు ఎన్ని విరాళాలు వచ్చేయో తెలుసా

Sri Tej: శ్రీతేజ్ కుటుంబానికి ఇప్పటి వరకు ఎన్ని విరాళాలు వచ్చేయో తెలుసా
x
Highlights

Sri Tej: పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్...

Sri Tej: పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడి 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతున్నట్లు కిమ్స్ వైద్యులు తెలిపారు. బాలుడి ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్ విడుదల చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఈ ఘటన గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపాయి.దీంతో సినీ సెలబ్రిటీలు శ్రీతేజ్ ను పరామర్శించేందుకు ఆసుపత్రికి క్యూ కడుతున్నారు. అంతేకాదు తమకు తూచిన విధంగా సాయాన్ని ప్రకటిస్తున్నారు. తెలంగాణ సర్కార్ శ్రీతేజ్ కు అభయన్న హస్తంగా మారింది. తొక్కిసలాట జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరుండి మరీ చూసుకుంటుంది. ఇప్పటి వరకు ఎవరు ఎంత విరాళాలు ఆ కుటుంబానికి ఇచ్చారో చూద్దాం.

శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి నటుడు జగపతి బాబు, ఆర్ నారాయణమూర్తి..వారి కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసానిచ్చారు. తాజాగా పుష్ప 2 నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు రవిశంకర్, నవీన్ రూ. 50లక్షలు శ్రీతేజ్ కుటుంబానికి అందించారు. అల్లు అర్జున్, సుకుమార్ కలిసి 2కోట్లతో ఒక ట్రస్టును ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ప్రొడ్యూసర్ దిల్ రాజు రేవతి భర్తకు ఫిలిం ఇండస్ట్రీలో ఒక పర్మినెంట్ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే 25లక్షలు ఆర్థిక సాయం చేశారు. శ్రీతేజ్ అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

ఇక శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతుందని మంగళవారం డాక్టర్లు తెలిపారు. ఆక్సిజన్ సహాయం కానీ, వెంటిలేటర్ సపోర్ట్ కానీ లేకుండానే తాను ఊపిరి తీసుకుంటున్నాడని తెలిపారు. అప్పుడప్పుడు కళ్లు తెరుస్తున్నాడని..ఐ కాంటాక్ట్ కానీ, కుటుంబ సభ్యులను గుర్తుపట్టడం కానీ చేయడం లేదని తెలిపారు. సైగలను గమనిస్తున్నాడు కానీ..మా మాటలను అర్థం చేసుకోలేకపోతున్నాడని వైద్యులు హెల్త్ బులిటెన్ లో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories