Mumbai High Court: ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ

High Court Hearing on Aryan Khan Bail Petition Today 26 10 2021
x

ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ(ఫైల్ ఫోటో)

Highlights

*ఇప్పటికే మూడుసార్లు బెయిల్ తిరస్కరణ *నాలుగోసారి బెయిల్‌ కోసం పిటిషన్‌ *కేసులో ఆర్యన్‌‌ఖాన్‌కు సంబంధం ఉందంటున్న ఎన్సీబీ

Mumbai High Court: ముంబై క్రూయిజ్‌ షిప్‌ కేసులో ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరుపుతోంది న్యాయస్థానం. ఇప్పటికే మూడుసార్లు ఆర్యన్‌కు బెయిల్‌ నిరాకరించింది న్యాయస్థానం. దీంతో నాలుగోసారి బెయిల్‌ కోసం పిటిషన్‌ వేశారు ఆర్యన్‌ తరపు న్యాయవాది. అయితే, ఈ కేసులో ఎన్‌సీబీ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ను వ్యతిరేకించింది ఎన్‌సీబీ.

ఈ కేసులో అరెస్టైన మిగతా వారిలాగే ఆర్యన్‌ఖాన్‌కు కూడా సంబంధం ఉందని వాదనలు వినిపించింది. ఆర్యన్‌ఖాన్‌ను, మిగతావారిని వేరు చేసి చూడలేమని చెప్పింది ఎన్‌సీబీ. ఇప్పటి వరకు క్రూయిజ్‌ షిప్‌ డ్రగ్స్‌ కేసులో 20మందిని అరెస్ట్‌ చేశారు ఎన్‌సీబీ అధికారులు. గతవారం ఆర్యన్‌ ఖాన్‌కు 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది కోర్టు. అక్టోబర్‌ 8న దాఖలు చేసిన ఆర్యన్‌ఖాన్‌ బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. ఇప్పుడు మరోసారి బెయిల్‌పై విచారణ జరుపుతున్న న్యాయస్థానం. ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories