Trisha Krishnan: యంగ్ హీరోయిన్లకూ గట్టి పోటీ ఇస్తున్న త్రిష..

Trisha Krishnan: యంగ్ హీరోయిన్లకూ గట్టి పోటీ ఇస్తున్న త్రిష..
x
Highlights

Trisha Krishnan: 40 ఏళ్ల వయస్సులోనూ యువ నటీమణులకు గట్టి పోటీని ఇస్తోంది హీరోయిన్ త్రిష.

Trisha Krishnan: 40 ఏళ్ల వయస్సులోనూ యువ నటీమణులకు గట్టి పోటీని ఇస్తోంది హీరోయిన్ త్రిష. ఒకప్పుడు తెలుగులో స్ఠార్ హీరోయిన్‌గా ఆమె కొనసాగారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారిపోయారు. ఆమె 2024లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. దళపతి విజయ్ నటించిన ది గోట్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. కానీ ఈ ఏడాది మాత్రం వరుస సినిమాలను ఓకే చేశారు. ఒకటి కాదు రెండు కాదు తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో వరుసగా సినిమాలు చేశారు.2025లో ఏకంగా ఆమె నటించిన ఆరు సినిమాల విడుదలకానున్నాయి.ఇవన్నీ కూడా స్టార్ హీరోల సినిమాలే .

అజిత్ హీరోగా నటిస్తున్న విదాముయార్చి ఆమె నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకు మిజ్ తిరుమేని దర్శకత్వం వహించారు. అజిత్ నటిస్తున్న మరో సినిమా గుడ్ బాడ్ అగ్లీ సినిమాలోను త్రిషదే మెయిన్ రోల్.అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పుష్ప నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.అలాగే మణిరత్నం దర్శకత్వంలో కమల హాసన్ హీరోగా వస్తున్న థగ్ లైఫ్ సినిమాలోని త్రిషది కీ రోల్. అదే విధంగా సూర్య 45 సినిమాలోనూ ఆమె నటిస్తున్నారు.

వీటితో పాటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న విశ్వంభర సినిమాలోనూ త్రిష హీరోయిన్‌గా చేస్తున్నారు. ఇక మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ హీరోగా వస్తున్న ఐడెంటిటీ అనే సినిమాలోనూ త్రిష నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాలతో 2025లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఈ వయస్సులోనూ అందం, అభినయంతో ఆకట్టుకుంటున్నారు. మరి ఈ అమ్మడు నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories