'మీటూ' ఉద్యమమే అప్పుడు నన్ను కాపాడింది: సాయిపల్లవి

మీటూ ఉద్యమమే అప్పుడు నన్ను కాపాడింది: సాయిపల్లవి
x
Highlights

ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ నటుడు ఆ దర్శకుడితో ‘తనకిష్టంలేదనప్పుడు వదిలేయండి. ఒకవేళ ఇప్పుడు తను బయటకు వెళ్లి మీటూ ఆరోపణలు చేస్తే?’ఏంటని ప్రశ్నించాడు.

కేవలం కథకి మాత్రమే కాకుండా పాత్రకి కూడా ప్రాధాన్యత ఇస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ లలో సాయి పల్లవి ఒకరు. ఫిదా, ఎంసీఎ, పడిపడి లేచే మనుసు సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ మలయాళీ భామ. ప్రస్తుతం కన్నడ, తమిళ, తెలుగు భాషా చిత్రాల్లో బిజీ హీరోయిన్ గా స్థిరపడిపోయింది. ముందు నుంచి కథలు, పాత్రలే నమ్ముకుంటున్న వస్తున్న సాయి పల్లవి గ్లామర్ షోకి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినీ కెరీర్ లో తానూ ఎదురుకున్న పరిస్థితుల గురించి వెల్లడించింది సాయి పల్లవి.

ఓ సినిమా షూటింగ్‌ చేస్తున్నప్పుడు హీరోతో లిప్‌లాక్‌ సన్నివేశాలు చేయాలని దర్శకుడు తనకి వెల్లడించినట్టుగా సాయి పల్లవి వెల్లడించింది. అయితే తానూ ముందుగా అందుకు ఒప్పుకోలేదని, ఆ తర్వాత మళ్ళీ అడిగినప్పటికి తానూ నిరాకరించానని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఓ నటుడు ఆ దర్శకుడితో 'తనకిష్టంలేదనప్పుడు వదిలేయండి. ఒకవేళ ఇప్పుడు తను బయటకు వెళ్లి మీటూ ఆరోపణలు చేస్తే?'ఏంటని ప్రశ్నించాడు. దీనితో ఆ నటుడు చెప్పిన మాటతో దర్శకుడు సైలెంట్‌ అయ్యాడని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. 'మీటూ' ఉద్యమమే తనని అలాంటి ఇబ్బందికర పరిస్థితి నుంచి కాడినట్టుగా సాయిపల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న లవ్ స్టొరీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అటు రానా హీరోగా వస్తున్నవిరాటపర్వం సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories