Yash: విలన్‌గా యశ్ కొత్త రికార్డ్ ? రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!

Yash: విలన్‌గా యశ్ కొత్త రికార్డ్ ? రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!
x
Highlights

Yash Remuneration: హీరో యశ్.. కేజీఎఫ్‌(KGF) సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు.

Yash Remuneration: హీరో యశ్.. కేజీఎఫ్‌(KGF) సినిమాలతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు. అప్పటి నుంచి ఆచితూచి అడుగులేస్తున్న యశ్.. బాలీవుడ్ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ రామాయణ్‌లో నటించనున్నాడు. ఈ సినిమాలో యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కావడంతో ఈ పాత్రలో నటిస్తున్నందుకు గాను యశ్ ఏకంగా రూ.200 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా టాక్ వినిపిస్తోంది. దీంతో యశ్ రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

ఒకవేళ ఇదే నిజమైతే విలన్‌గా ఇంత భారీ మొత్తంలో పారితోషికం తీసుకుంటున్న హీరోగా యశ్ రికార్డ్ క్రియేట్ చేసినట్టే అంటున్నాయి సినీ వర్గాలు. నితీష్ తివారి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రామాయణ్(Ramayan) తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోల రెమ్యునరేషన్ రూ.100, రూ.200 కోట్ల వరకు ఉంటోంది. ఇటీవల ఇండస్ట్రీ హిట్ కొట్టిన పుష్ప2 సినిమాకు అల్లు అర్జున్ రూ. 300 కోట్లు తీసకున్నారని టాక్. కానీ ఇప్పుడు విలన్‌గా యశ్‌కు రూ.200 కోట్లంటే ఇదొక రికార్డు అని చెప్పుకోవచ్చు. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాల విజయాలు యశ్ కెరీర్‌లో కీలక పాత్ర పోషించాయనే సంగతి తెలిసిందే. యశ్.. కాస్త గ్యాప్ తర్వాత టాక్సిక్ అనే సినిమా చేస్తున్నాడు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఈ చిత్రంలో నయనతార, కియారా అద్వానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారని టాక్. ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను 2025 సమ్మర్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక యశ్ నటిస్తున్న టాక్సిక్, రామాయణ్ ఎలా ఉంటాయో చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories