Vishal: లంచం తీసుకున్నరు.. సెంట్రల్ సెన్సార్ బోర్డుపై విశాల్ సంచలన ఆరోపణలు
Vishal: మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ కోసం.. రూ.6.50 లక్షలు తీసుకున్నారంటూ వీడియో రిలీజ్
Vishal: సెంట్రల్ సెన్సార్ బోర్డుపై తమిళ హీరో విశాల్ సంచలన ఆరోపణలు చేశారు. ముంబైలో సెన్సార్ బోర్డు సభ్యులు లంచం తీసుకున్నారని ఆరోపించారు. తాను నటించిన మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ కోసం 6 లక్షల 50వేల రూపాయల లంచం తీసుకున్నారంటూ Xలో వీడియో రిలీజ్ చేశారు విశాల్. డబ్బులు పంపిన అకౌంట్ డీటేల్స్ తో సహా పోస్ట్ చేశారు. ఈ అవినీతిని జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనను ప్రధాని మోడీ, మహారాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సినిమాల్లో అవినీతిని చూడటం ఓకే కానీ నిజ జీవితంలో జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని తెలిపారు విశాల్. ప్రభుత్వ కార్యాలయాల్లో మరీ ముఖ్యంగా ముంబైలోని CBFC ఆఫీసులో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తన సినిమా మార్క్ ఆంటోని హిందీ వెర్షన్ స్క్రీనింగ్ కోసం 3లక్షలు, సర్టిఫికెట్ కోసం మూడున్నర లక్షలు ఇచ్చానని చెప్పారు. మరో దారి లేక డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందన్నారు. భవిష్యత్‌లో ఏ నిర్మాతకు ఇలా జరగకూడదని.. న్యాయమే గెలుస్తుందని Xలో పోస్ట్ చేశారు విశాల్.
#Corruption being shown on silver screen is fine. But not in real life. Cant digest. Especially in govt offices. And even worse happening in #CBFC Mumbai office. Had to pay 6.5 lacs for my film #MarkAntonyHindi version. 2 transactions. 3 Lakhs for screening and 3.5 Lakhs for… pic.twitter.com/3pc2RzKF6l
— Vishal (@VishalKOfficial) September 28, 2023
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire