Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండకు గాయం..

Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండకు గాయం..
x
Highlights

Vijay Devarakonda: హీరో విజయ్ దేవరకొండకు గాయాలపాలైనట్లు సమాచారం. షూటింగ్ స్పాట్ లో జరిగిన ప్రమాదంలో ఆయన గాయపడినట్లు తెలుస్తోంది.

Vijay Devarakonda: టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండకు గాయాలు అయినట్లు వార్తలు వస్తున్నాయి. VD12మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయనకు షూటింగ్ లో జరిగిన ఓ ప్రమాదంలో గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఓ యాక్షన్ సీన్ ను చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని సమాచారం.

అయితే విజయ్ దేవరకొండను ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఫిజియోథెరపీ పూర్తయిన తర్వాత మళ్లీ విజయ్ షూటింగ్ లో పాల్గొన్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ నటిస్తున్నారు. VD12 వర్కింగ్ టైటిల్. ఈ సినిమా షూటింగ్ లో రౌడీ బాయ్ గాయపడ్డారు. కేరళలో ఇటీవల షెడ్యూల్ చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం హైదరాబాద్ లో మిగతా చిత్రీకరణ జరుగుతోంది.

ఈ మూవీలో విజయ్..పోలీసు అధికారిగా నటిస్తున్నారట. వచ్చే ఏడాది మార్చి 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories