విడాకులు తీసుకోబోతున్న బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ.. మూడో వ్యక్తే కారణమా?

Hero Vijay Antony Heading For Divorce?
x

విడాకులు తీసుకోబోతున్న బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోనీ.. మూడో వ్యక్తే కారణమా?

Highlights

Vijay Antony Divorce: ఈ మధ్యకాలంలో ఫిలిం ఇండస్ట్రీలో విడాకులు చాలా కామన్ అయిపోయాయి.

Vijay Antony Divorce: ఈ మధ్యకాలంలో ఫిలిం ఇండస్ట్రీలో విడాకులు చాలా కామన్ అయిపోయాయి. ఒకప్పుడు స్టార్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నాగచైతన్య-సమంత, ధనుష్-ఐశ్వర్య, అమీర్ ఖాన్-కిరణ్ ఇప్పటికే విడాకులు తీసుకొని ఒకరికి ఒకరు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఇప్పుడు మరొక స్టార్ జంట విడాకులు తీసుకోబోతున్నారు. బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విజయ్ ఆంటోనీ ప్రస్తుతం వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కుంటున్నట్లు కోలీవుడ్‌ టాక్‌. తన బార్య ఫాతిమాతో ఆయనకు విబేధాలు వచ్చాయని, ఈ కారణంగా విడాకులు ఇవ్వబోతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

విజయ్ ఆంటోని డైరెక్ట్ గా ఈ విషయాన్ని వెల్లడించకపోయినా తన పోస్ట్ ద్వారా ఈ విషయానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. తన ట్విట్టర్ అకౌంట్ లో మీ ఫ్యామిలీలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను మీలో మీరు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలని విజయ్ ఆంటోని అన్నారు. అంతేకానీ మధ్యలోకి మూడో వ్యక్తిని రానీయకండి. ఎందుకంటే మూడో వ్యక్తి జీవితంలోకి వస్తే వాళ్లు మిమ్మల్ని నాశనం చేసి సంతోషిస్తారు అని విజయ్ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. సాధారణంగా తన సినిమాల గురించి తప్పా సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని విజయ్‌ ఇలాంటి కామెంట్స్‌ చేయడంపై తమిళనాట పెద్ద చర్చ నడుస్తుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories