కొన్ని సినిమాలు మామూలుగా వస్తాయి. కానీ, మామూలుగా ఉండవు. వాటికి దక్కే ఆదరణా మామూలుగా ఉండదు. అటువంటి మామూలు కాని సినిమా నువ్వు నాకు నచ్చావ్. చల్లగా వచ్చి.. ప్రేక్షకులకు మెల్లగా నచ్చి.. అందర్నీ మెప్పించిన సినిమా నువ్వు నాకు నచ్చావ్ సినిమా వచ్చి నేటికి 18 ఏళ్ళు. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన కొన్ని విశేషాలు..
హీరో వెంకటేష్ కెరియర్ లోనే గుర్తుండి పోయే సినిమా 'నువ్వు నాకు నచ్చావ్' ... ఈ సినిమా వెంకటేష్ లోని కామెడి యాంగిల్ ని చాలా కొత్తగా చూపించింది . ఈ సినిమాలో వెంకటేష్ కామెడికి అప్పట్లో ప్రేక్షకులు దియేటర్లకు ఎగబడుకుంటూ వచ్చారు . బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది . అయితే ఈ సినిమా నేటితో 18 ఏళ్ళును పూర్తి చేసుకుంది . సినిమాలోని కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీకోసం ...
1. నువ్వే కావాలి సినిమాకి గాను విజయభాస్కర్ , త్రివిక్రమ్ వర్క్ నచ్చి నెక్స్ట్ సినిమాకి గాను ముందే అడ్వాన్స్ ఇచ్చారు స్రవంతి'రవికిషోర్ '. ఆ సినిమానే నువ్వు నాకు నచ్చావ్!
2. విజయభాస్కర్ , త్రివిక్రమ్ కలిసి సినిమా సబ్జెక్టు ని టీం మొత్తానికి వినిపిస్తే అందరు సినిమా స్క్రిప్ట్ కి వందకు వంద మార్కులు ఇచ్చేసారట. అ సినిమా స్టొరీ బాగా నచ్చడంతో ఇప్పటికి సినిమా స్క్రిప్ట్ ని తన టేబుల్ పైనే పెట్టుకుంటారట నిర్మాత రవికిషోర్.
3.రవికిషోర్‌కి ప్రొడ్యూసర్ డి.సురేశ్‌బాబు చాలా క్లోజ్. అక్కడ్నుంచీ ప్రపోజల్ వచ్చింది. ''విజయ్‌భాస్కర్ - త్రివిక్రమ్‌లతో చేయడానికి మా వెంకటేశ్ రెడీ! మీకు ఓకేనా?'' దీనితో ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా సెట్ అయ్యాడు ..
4. త్రివిక్రమ్ వెళ్లి వెంకటేష్ కి వెళ్లి కథ చెప్పడంతో వెంకటేశ్ ఫ్లాట్ అయ్యారట. ''వాట్ ఎ లవ్ లీ క్యారెక్టైరె జేషన్'' అని కితాబు ఇచ్చారట. కానీ సినిమాలో సెకండాఫ్ మొత్తం ఓ ఇంట్లోనే కథ నడిచిపోతోంది. ఆడియన్స్‌కి కొంచెం రిలీఫ్ కావాలి కదా! అని డౌట్ చెప్పడంతో సినిమాలో ఓ క్యారెక్టర్ క్రియేట్ చేసారు , ఆ క్యారెక్టరే బ్రహ్మానందం. సినిమాలో ఇది ఎంత బాగా నవ్వుల పువ్వుల్ని పూయించిందో అందరికీ తెలిసిందే.
5. సినిమాకి అన్ని ఓకే అయినా, ఇంకా రెండు పాత్రలు మిగిలిపోయాయి . ఒకటి హీరోయిన్ పాత్ర కాగా, మరొకటి హీరోయిన్ తండ్రి పాత్ర. ముందుగా హీరోయిన్ గా త్రిషను అనుకున్నారట. కానీ, ఫ్రెష్ లుక్ కోసం ఆర్తీ అగర్వాల్ ని తీసుకున్నారు . ఇక హీరోయిన్ తండ్రి పాత్ర కోసం నాజర్ , రఘువరన్ అనుకున్నా రవికిషోర్ ప్రకాష్ రాజ్ కావాలని పట్టుబట్టారట.
6. ఇక అన్ని ఓకే అయ్యాక నానక్‌రామ్‌గూడా రామానాయుడు స్టూడియోలో ఆర్ట్ డెరైక్టర్ పేకేటి రంగాతో హౌస్‌సెట్ వేయించేశారు.దీనికైన ఖర్చు అక్షరాల 60 లక్షలు.
7. సినిమాలోని రెండు పాటల కోసం న్యూజిలాండ్ వెళ్లారు . కానీ అక్కడికి వెళ్ళాక వెంకటేష్ విపరీతమైన జ్వరంతో బాధపడ్డారు. అయినా గానీ షెడ్యూల్ పాడైపోకూడదని ఆ పరిస్థితిలోనూ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ కమిట్ మెంట్ తోనే సినిమా రిజల్ట్ ఆదరగొట్టింది.
8. సినిమా మొత్తాన్ని 64 రోజుల్లో పూర్తి చేసారు .
9. సినిమా మొత్తం అయిపోయాక సినిమా రీ-రికార్డింగ్ మొదలు పెట్టారు .కోటి చేసిన రీ-రికార్డింగ్ మొదటగా రవికిషోర్ కి నచ్చలేదట. మళ్లీ రీ-రికార్డింగ్ కోసం శ్రమించారు కోటి. ఈ సారి వచ్చిన అవుట్ పుట్ కి బెస్ట్ రీ-రికార్డింగ్ ఇచ్చారంటూ రవికిశోర్ కోటిని గట్టిగా హగ్ చేసుకున్నారు.
10. ఈ సినిమా 3 గంటల 12 నిమిషాలు నిడివితో 2001 సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మొదటిగా సినిమా లెంగ్త్ ఎక్కువైపోయిందని అన్నారు . సినిమాలోని సుహాసిని ఎపిసోడ్ మొత్తం డిలీట్ చేయమని అన్నారు . కానీ రవికిశోర్ పట్టుదలతో సినిమాలోని ఒక్క బిట్టును కూడా కట్ చేయలేదు .
11. క్రమేపీ సినిమా ప్రేక్షకులకు చేరువైంది. నాలుగు రోజుల తర్వాత నుంచి సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు.
12. వెంకటేశ్ పారితోషికం మినహాయిస్తే, ఈ సినిమాకైన బడ్జెట్ నాలుగున్నర కోట్ల రూపాయలు. ఆర్తీ అగర్వాల్ కి ఇచ్చిన పారితోషికం పది లక్షలు.
13. తమిళంలో ఈ చిత్రాన్ని విజయ్‌తో రీమేక్ చేశారు.
14. 'ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని...' పాట కోసం 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి 60 పల్లవులు రాశారు. ఫైనల్‌గా ఫస్ట్ రాసిన పల్లవి ఓకే అయ్యింది.
15. 'బంతి' అనే క్యారెక్టర్‌తో సునీల్‌కి మంచి బ్రేక్ వచ్చింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire