Prabhas: గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్.. వయనాడ్ బాధితులకు ఎన్ని కోట్లు ఇచ్చాడో తెలుసా.?

Hero Prabhas Gives RS 2 Crore for Wayanad Landslides Victims
x

Prabhas: గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్.. వయనాడ్ బాధితులకు ఎన్ని కోట్లు ఇచ్చాడో తెలుసా.?

Highlights

ప్రభాస్ తో మరికొందరు సినీ తారలు సైతం వయనాడ్ భాదితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.

Prabhas: కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి సృష్టించిన భీకరం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారీ వర్షాలు, కొండచరియలు విరిగి పడడంతో వందలాది మంది ప్రాణాలు విడిచారు, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రకృతి ప్రకోపానికి గురైన వారికి సినిమా సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. పలువురు స్టార్ హీరోలు తమవంతు సాయంగా ఆర్ధిక సాయం అందించారు.

అయితే తన సినిమాలతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న హీరో ప్రభాస్ సాయంలోనూ తన గొప్ప మనసును చాటుకున్నారు. వయనాడ్ భాదితులను చూసి చలించిపోయిన ప్రభాస్ గాయపడిన భాదితుల చికిత్స సహాయార్ధం భారీగా ఆర్థిక సాయం అందించాడు. ఇప్పటి వరకు అందరు హీరోలు అందించిన దాని కంటే ఎక్కువగా ఏకంగా రూ. 2 కోట్లు అందించాడు. ప్రభాస్ కు కేరళలో కూడా భారీగా అభిమానులు ఉన్నారు. తన సినిమాలను ఆదరించే అభిమానులు కష్టాల్లో ఉండడంతో ప్రభాస్ గొప్ప మనసు చాటుకున్నారు.

ఇదిలా ఉంటే ప్రభాస్ తో మరికొందరు సినీ తారలు సైతం వయనాడ్ భాదితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఇందులో భాగంగానే సూర్య, జ్యోతిక, కార్తీ కలిపి రూ. 50లక్షలు, కమల్ హాసన్ రూ. 25 లక్షలు అందించారు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రూ. 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిపి కోటి రూపాయల ఆర్థిక సాయం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories