Pawan Kalyan Thanks To Charan, Allu Arjun : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా , ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్
Pawan Kalyan Thanks To Charan, Allu Arjun : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా , ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు అక్కడికక్కడే మృతి చెందినా సంగతి తెలిసిందే.. చిత్తూరు జిల్లా కుప్పం సమీపంలోని శాంతిపురం మండలం ఏడవమైలు గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే ఈ విషయం తెలియగానే పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.. చనిపోయిన కుటుంబాలకి గాను ఒక్కొక్కరికీ రెండు లక్షల రూపాయల ఆర్థికసాయం అందించాలని పార్టీ కార్యాలయ సిబ్బందిని ఆదేశించినట్లు పవన్ ఓ ప్రకటనలో తెలిపారు.
అయితే పవన్ కళ్యాణ్ తో పాటుగా మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ చనిపోయిన కుటుంబాలకి ఆర్థికసాయం ప్రకటించారు. ఇందులో అల్లు అర్జున్ ఒక్కొక్కరి చొప్పున రెండు రెండు లక్షలు ఇవ్వగా, రామ్ చరణ్ రెండున్నర లక్షలు ఇచ్చారు. దీనిపట్ల పవన్ కళ్యాణ్ వారికిసోషల్ మీడియా ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ తో పాటుగా మైత్రి మూవీ మేకర్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు కూడా చనిపోయిన కుటుంబాలకి ఆర్థికసాయం అందజేసారు. వీరికి కూడా పవన్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. వకీల్ సాబ్ సినిమా పవన్ రీఎంట్రీ మూవీగా తెరకెక్కుతుంది. ఇది పవన్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. ఈ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక క్రిష్ మూవీ డైరెక్షన్ లో ఓ సినిమాని, హరీష్ శంకర్ మూవీ డైరెక్షన్ లో ఓ సినిమాని చేస్తున్నాడు పవన్.
My heartfelt thanks to Sri @AlwaysRamCharan for his kindhearted gesture of sending Rs 7.5 lakhs(2.5 to each) to the 3 deceased Janasainiks families, who had lost their lives in a tragic accident in Chittoor.
— Pawan Kalyan (@PawanKalyan) September 12, 2020
Your compassionate gesture will be remembered. Thank you.
My heartfelt thanks 🙏 to
— Pawan Kalyan (@PawanKalyan) September 12, 2020
Sri @alluarjun garu for standing by the families of deceased, by giving 6 lakhs( 2lakhs to each). My Good wishes to you.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire