Nani 'V' Movie : నిర్మాతకి నష్టం రాకుండా చూసుకోవడం మన భాధ్యత : హీరో నాని

Nani V Movie : నిర్మాతకి నష్టం రాకుండా చూసుకోవడం మన భాధ్యత : హీరో నాని
x

Hero Nani 

Highlights

Nani 'V' Movie : విభిన్న కథా చిత్రాల చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'v'.. ఇందులో నాని,

Nani 'V' Movie : విభిన్న కథా చిత్రాల చిత్రాల దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం 'v'.. ఇందులో నాని, సుదీర్ బాబు హీరోలుగా నటించగా, అదితిరావు హైదరి, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాని , శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించగా, అమిత్ త్రివేది సంగీతం అందించాడు. హీరో నానికి ఇది 25వ చిత్రం కావడం విశేషం..

అయితే ముందుగా ఈ చిత్రాన్ని ఉగాది సంద‌ర్భంగా విడుద‌ల చేయ‌డానికి చిత్ర యూనిట్ చాలా ప్రయ‌త్నాలు చేసింది. కానీ అప్పుడే క‌రోనా వైర‌స్ ఉగ్రరూపం దాల్చడంతో.. థియేట‌ర్స్ అన్ని లాక్ డౌన్ కార‌ణంగా మూత‌ప‌డ‌టంతో ఈ సినిమా విడుదల వాయిదా వేసింది. అయితే తాజాగా ఈ సినిమాకి అమెజాన్ ప్రైమ్ నుంచి భారీ రేటు పలకడంతో సెప్టెంబర్ 05 న ఓటీటీలో విడుదల అవుతుంది.

సినిమా ప్రమోషన్ లో భాగంగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన నాని కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సినిమా ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమా రిలీజ్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. నా సినీ ప్రయాణంలో ఇంతమంది అభిమానుల ప్రేమ, ఆప్యాయతలను సొంత చేసుకుంటానని ఎప్పుడు అనుకోలేదని, ఇది నా అదృష్టమని అన్నారు.

ఇక సినిమాకి లాభం వస్తుందనే రాబడి పెడతామని, అయితే అనుకున్నంతగా లాభం రానప్పుడు పారితోషికాన్ని తగ్గించుకోవడం లేదా వెనుకకి ఇచ్చేయడం లాంటి చేయాలని, నిర్మాతకి నష్టం రాకుండా చూసుకోవడం మన భాధ్యత అని అన్నారు. అలా అని అందరూ హీరోలు తగ్గించుకోవాలని స్టేట్ మెంట్ లు ఇవ్వడం లేదని, నిర్మాతకి ఏమీ మిగలడం లేదు అన్నప్పుడు జీరో పారితోషికానికి వెనుకడుగు వేయ్యోద్దని చెప్పుకొచ్చాడు.

ఇక సినిమాలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటందని, సుదీర్ బాబు కూడా చాలా బాగా చేశాడని అన్నారు. బాలీవుడ్ లో సినిమాలు చేయలని కోరిక ఏమీ లేదని అవకాశాలు వస్తే చేస్తానని అని అన్నాడు. ఇక త్వరలోనే టక్ జగదీశ్ షూటింగ్ మొదలు అవుతుందని వెల్లడించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories