Jagapathi Babu: స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసిన హీరో జగపతి బాబు..వీడియో వైరల్

Jagapathi Babu: స్ట్రీట్ ఫుడ్ తింటూ ఎంజాయ్ చేసిన హీరో జగపతి బాబు..వీడియో వైరల్
x
Highlights

Jagapathi Babu: టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా...

Jagapathi Babu: టాలీవుడ్ ప్రముఖ నటుడు జగపతి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎక్కువగా సినిమాల్లో విలన్ క్యారెక్టర్లలో నటిస్తున్నారు. ప్రస్తుతం జగపతి బాబు చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నట్లు సమాచారం. ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫ్యాన్స్ తో ముచ్చటిస్తుంటారు. తాను చేసే పనుల గురించి తన ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటారు.

సరదాగా ఫన్నీ వీడియోలు కూడా షేర్ చేస్తుంటారు. తాజాగా మరో వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. భీమవరం ఫుడ్ ఫెస్టివల్ లో రోడ్డు పక్కనే ఉన్న బండి దగ్గర ఫుడ్ తింటూ ఎంజాయ్ చేశారు. మరొకొంతమంది నటులతో కలిసి జగపతిబాబు రోడ్ సైడ్ ఫుడ్ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. భీమవరం ఫుడ్ ఫెస్టివల్ కంటిన్యూటికీ ఈ మనిషి రోడ్డున పడ్డాడు అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


అయితే ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. మీరు చాలా గ్రేట్ సార్..అంత పెద్ద సెలబ్రిటీ అయి ఉండి ఇలా స్ట్రీట్ ఫుడ్ తినడం చాలా గొప్ప విషయం అని కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories