దయచేసి ఆ పని చేయండి.. నెట్ ఫ్లిక్స్ వారికి హరీష్ శంకర్ రిక్వెస్ట్..

Harish Shankar Advising Netflix
x

నెట్ఫ్లిక్స్ వారికి సలహా ఇస్తున్న హరీష్ శంకర్

Highlights

* డైరెక్టర్ హరీష్ శంకర్ నెట్ ఫ్లిక్స్ వారికి ఏం సూచిస్తున్నారంటే

Harish Shankar: ఈ మధ్యకాలంలో థియేటర్లలో సినిమాలు చూసేవారికంటే ఓటీటీలలో సినిమాలు చూడటానికి ఆసక్తి చూపించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతూ వస్తోంది. అమెజాన్ ప్రైమ్, ఆహా, హాట్ స్టార్ వంటి ఓటీటీల లాగానే నెట్‌ఫ్లిక్స్ కి కూడా భారతదేశం నుంచి బోలెడు మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఈ మధ్యకాలంలో బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన తెలుగు సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్ లోనే ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో నిన్న మొన్నటిదాకా ఎకౌంట్ లేని వారు కూడా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుని మరి సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అంతకుముందు వరకు ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే విడుదల చేసే నెట్‌ఫ్లిక్స్ తర్వాత నెమ్మదిగా హిందీ సినిమాలు, ఇప్పుడు తెలుగు సినిమా ల పై కూడా కన్నేసింది. కానీ తాజా సమాచారం ప్రకారం తెలుగు సినిమాలను నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసే సమయంలో కొన్ని సమస్యలు వస్తున్నాయట. ముఖ్యంగా తెలుగు భాషకి చెందిన నెట్ ఫ్లిక్స్ లో కీలక వ్యక్తి లేకపోవడంతో నిర్మాతలకు ఇది ఒక పెద్ద ఇబ్బందిగా మారింది. నెట్ ఫ్లిక్స్ వారు ఇండియా ప్రతినిధులతో చర్చలు జరిపే సమయంలో భాషకి సంబంధించిన సమస్యలు వస్తున్నాయట.

అందుకే తెలుగు భాషకు ప్రత్యేకంగా ఒక అధినేత ఉంటే బాగుంటుందని ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ సలహా ఇస్తున్నారు. హరీష్ శంకర్ చెప్పిన ప్రతిపాదన మిగతా టాలీవుడ్ డైరెక్టర్లకు కూడా బాగా నచ్చింది. మరి హరీష్ శంకర్ సలహాను నెట్ ఫ్లిక్స్ వారు ఎంతవరకు పాటిస్తారో వేచి చూడాలి. చిన్న పెద్ద సినిమాలతో తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న తెలుగు సినిమాల విషయంలో తుది నిర్ణయం తీసుకోవడానికి ఒక తెలుగు వ్యక్తి నెట్ ఫ్లిక్స్ తరఫున ఉంటే నిజంగానే బాగుంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories