Bigg Boss 8 Telugu: హరితేజ, గంగవ్వకు బిగ్‌బాస్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Hari Teja and Gangavva Remuneration for Bigg Boss 8 Telugu Above RS 17 Lakhs Reports Says
x

Bigg Boss 8 Telugu: హరితేజకు, గంగవ్వకు బిగ్‌బాస్‌ రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా?

Highlights

Bigg Boss 8 Telugu: హరితేజ.. బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

Bigg Boss 8 Telugu: హరితేజ.. బిగ్‌ బాస్‌ హౌజ్‌ నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ వారం హరితేజతో పాటు కొన్న అనారోగ్య కారణాల వల్ల గంగవ్వ హౌజ్‌ నుంచి బయటకు వచ్చేసింది. ఇక వీరిద్దరూ ఈ సీజన్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ద్వారా హౌజ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌లో హరితేజ ప్రేక్షకులను బాగా మెప్పించిన విషయం తెలిసిందే.

ఆ సీజన్‌లో హరితేజ ఏకంగా సెకండ్‌ రన్నరప్‌గా నిలిచింది. అయితే ఈ సీజన్‌లో మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వడమో, హౌజ్‌లో ఇతర కంటెస్టెంట్స్‌ నుంచి పోటీ ఉండడమో కారణం ఏదైనా.. ఈసారి హరితేజ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో హరితేజకు ఓటింగ్‌కు కూడా భారీగా తగ్గింది. దీంతో హౌస్ నుంచి బయటకు రాక తప్పలేదు.

అయితే బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఐదు వారాలు ఉన్న హరితేజ ఎంత రెమ్యునరేషన్ తీసుకుందన్న అంశం ఆసక్తిగా మారింది. సినిమాలు, సీరియల్స్‌లో కీలక పాత్రల్లో నటించిన హరితేజకు మంచి ఫాలోయింగ్‌ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ బ్యూటీకి బిగ్‌బాస్‌ భారీగానే ముట్టజెప్పినట్లు తెలుస్తోంది. హరితేజకు రోజుకు రూ. 50 వేల రెమ్యునరేషన్‌ ఇచ్చారని టాక్‌. ఇలా వారానికి రూ. 3.5 లక్షల చొప్పున ఐదు వారాలకు గాను హరితేజ రూ. 17 లక్షలకు పైగా రెమ్యునరేషన్‌ రూపంలో పట్టుకెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక హరితేజ్‌ కెరీర్‌ విషయానికొస్తే ఈ బ్యూటీ.. ఇటీవల ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన.. దేవర సినిమాలో నటించిన విషయం తెలిసిందే.

గంగవ్వ రెమ్యునరేషన్‌ ఎంతంటే..

ఇక గంగవ్వ విషయానికొస్తే ఈమె కూడా ఈసారి వైల్డ్‌ కార్డ్‌ ద్వారా హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. గతంలో అనారోగ్య కారణాలతో మధ్యలోనే వెళ్లిపోయిన గంగవ్వకి ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురైంది. ఇక గంగవ్వ ఈ సీజన్‌లో 5 వారాల పాటు ఉంది. ఆడియన్స్‌ కూడా బాగానే ఓటింగ్‌ వేస్తూ వచ్చారు. ఇక గంగవ్వ కూడా ఐదు వారాలకు గాను సుమారు రూ. 15 లక్షలకు పైగానే రెమ్యునరేషన్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories