Happy Birthday Prabhas : ప్రభాస్ కి పుట్టినరోజు జేజేలు!

Happy Birthday Prabhas : ప్రభాస్ కి పుట్టినరోజు జేజేలు!
x
Highlights

Happy Birthday Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అరుడుగుల అందగాడు... ఇన్ని రోజుల నుంచి ఒకలేక్క.. ఇప్పుడొక లెక్క అంటూ ఇండస్ట్రీలోని రికార్డులను బద్దలు కొట్టేందుకు బహుబలిగా వచ్చాడు. ఈ ఘాటు మిర్చి అంటే అమ్మాయిలకి చెప్పలేనేంత పిచ్చి.. అబ్బాయిలకు అనుచుకోలేనంత అసూయ..

Happy Birthday Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. అరుడుగుల అందగాడు... ఇన్ని రోజుల నుంచి ఒకలేక్క.. ఇప్పుడొక లెక్క అంటూ ఇండస్ట్రీలోని రికార్డులను బద్దలు కొట్టేందుకు బహుబలిగా వచ్చాడు. ఈ ఘాటు మిర్చి అంటే అమ్మాయిలకి చెప్పలేనేంత పిచ్చి.. అబ్బాయిలకు అనుచుకోలేనంత అసూయ.. దర్శకులకి బాగా నచ్చే డార్లింగ్.. నిర్మాతలకి డబ్బుల వర్షం కురిపించే మిస్టర్ పర్ఫెక్ట్.. ప్రేక్షకులతొస్ సాహో అనిపించుకున్న ప్రభాస్ నేడు 41 వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ప్రభాస్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఉప్పలపాటి సూర్యనారాయణరాజు, శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు ప్రభాస్.. పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరు తన స్వగ్రామం.. ప్రభాస్ కి ఓ అన్నయ్య, చెల్లలు ఉన్నారు.. అన్నయ్య పేరు ప్రబోధ్, చెల్లెలు పేరు ప్రగతి..

2. ప్రభాస్ తన ప్రాథమిక విద్యను డి.ఎన్.ఆర్ స్కూల్ భీమవరంలో పూర్తిచేశారు. బి .టెక్ శ్రీ చైతన్య కాలేజీ హైదరాబాద్ లో పూర్తిచేశాడు.

3. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు టాలీవుడ్ స్టార్ గా ఉండడంతో ప్రభాస్ కి సినిమాల్లోకి వచ్చేందుకు ఈజీగానే ఎంట్రీ దొరికింది. ఆలా 2002లో ఈశ్వర్ సినిమాతో ప్రభాస్ తెరంగేట్రం చేసాడు. ఈ సినిమాలో నటుడు విజయ్ కుమార్ కుమార్తె శ్రీదేవి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా కూడా ఆమెకి మొదటిది కావడం విశేషం.

4. ప్రభాస్ కి మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా వర్షం.. 2004లో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కి ఫస్ట్ బిగ్గెస్ట్ హిట్.. ఈ సినిమాతో ప్రభాస్ కి యూత్ లో ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది.

5. 2005లో ఎస్. ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమా ప్రభాస్ ని ఓ స్టార్ హీరో గా నిలబెట్టింది.

6. అప్పటివరకు ఒకే మూసలో వెళ్తున్న ప్రభాస్ ని కొత్తగా ప్రేక్షకులకి పరిచయం చేసింది మాత్రం బుజ్జిగాడు అనే చెప్పాలి.. ఇందులో కనిపించినట్టుగా ప్రభాస్ మరే సినిమాలో కూడా కనిపించడు. ఈ సినిమాకి లేడిస్ ఫాలోయింగ్ ఎక్కువే!

7. ప్రభాస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమాలు డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పాలి.. వరుసగా రెండు ఫ్యామిలీ స్టోరీస్ చేసి బోర్ కొట్టించకూడా వావ్ అనిపించాడు ప్రభాస్..

8. ఇక మిర్చిలో చాలా స్టైలిష్ గా, నీట్ గా కనిపిస్తూ అదరగొట్టాడు ప్రభాస్.. ఈ సినిమా తరవాత ప్రభాస్ కి లేడిస్ ఫాలోయింగ్ మరింతగా పెరిగింది.

9. ఇక బాహుబలి సినిమాతో తన రేంజ్ మాత్రమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని కూడా పెంచాడు ప్రభాస్..ఈ సినిమా తరవాత అన్ని పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నాడు ప్రభాస్...

10. ప్రస్తుతం రాధేశ్యామ్ మూవీ, నాగ్ అశ్విన్ తో ఓ సినిమా, అదిపురుష్ సినిమాలను చేస్తున్నాడు ప్రభాస్..

11. హీరోగా ఎంత ఎత్తు ఎదిగిన చాలా సింపుల్ గానే ఉంటాడు ప్రభాస్.. ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు వచ్చిన తనవంతు సహాయం చేసేందుకు ముందే ఉంటాడు.

12. మిర్చి సినిమాకి గాను ప్రభాస్ కి నంది అవార్డు వచ్చింది.

13. ఇండస్ట్రీలో ప్రభాస్ కి గోపిచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు విష్ణు మంచి స్నేహితులు..

14. ఇప్పటివరకు తన పెద్దనాన్న కృష్ణంరాజుతో కలిసి రెండు సినిమాలో నటించాడు ప్రభాస్.. అవే రెబల్, మున్నా

15. మేడమ్ టుస్సాడ్ యొక్క మైనపు మ్యూజియంలో మైనపు శిల్పాన్ని కలిగి ఉన్న మొదటి దక్షిణ భారత నటుడు ప్రభాస్ కావడం విశేషం.

16. మంచు విష్ణు నటించిన దేనికైనా రెడీ సినిమాకి ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు.

17. త్రిషతో మూడు సినిమాలు ( వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు), కాజల్ తో రెండు ( డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్), అనుష్క తో మూడు ( బిల్లా, మిర్చి, బాహుబలి) సినిమాలను చేశాడు.

18. ప్రభాస్ పెల్లి గురించి అటు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.


ప్రభాస్ ఇలాగే ఇలాగే మరిన్ని పుట్టిన రోజులు చేసుకోవాలని, మరిన్ని మంచి సినిమాలతో మెప్పించాలని, అలాగే తెలుగు సినిమా స్థాయిని మరింతగా పెంచాలని కోరుకుంటూ ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది HMTV..

Show Full Article
Print Article
Next Story
More Stories