Happy Birthday Mahesh Babu : అభిమాన శ్రీమంతుడికి పుట్టినరోజు జేజేలు!

Happy Birthday Mahesh Babu  : అభిమాన శ్రీమంతుడికి పుట్టినరోజు జేజేలు!
x
Happy Birthday Mahesh Babu
Highlights

Happy Birthday Mahesh Babu : అమ్మాయిల కలల రాజకుమారుడు అతను.. అభిమానుల గుండెల్లో నిండిన శ్రీమంతుడు.. డైరెక్టర్ , ప్రొడ్యూసర్ కి అతనో

Happy Birthday Mahesh Babu : అమ్మాయిల కలల రాజకుమారుడు అతను.. అభిమానుల గుండెల్లో నిండిన శ్రీమంతుడు.. డైరెక్టర్ , ప్రొడ్యూసర్ కి అతనో యువరాజు..హీరో ఎవరైనా సరే బాక్స్ ఆఫీస్ వద్ద అతని దూకుడుకి బ్రేక్ లేదు.. తెలుగు ప్రేక్షకులకి మాత్రం అతనో సూపర్ స్టార్ .. అతనే మహేష్ బాబు.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి రాజకుమారుడు నుంచి సూపర్ స్టార్ గా ఎదిగాడు మహేష్ బాబు.. అలాంటి మహేష్ బాబు ఈ రోజు 45 వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు.. ఈ సందర్భంగా మహేష్ బాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

* ఘట్టమనేని కృష్ణ. ఇందిరా దేవిలకి రెండో కుమారుడిగా 1975 ఆగస్టు 9న జన్మించాడు మహేష్ బాబు.. మహేష్ కి అన్నయ్య రమేష్ బాబు, అక్కలు పద్మావతి, మంజుల ఉన్నారు.

* మహేష్ బాబు విధ్యాబ్యాసం అంతా మద్రాసులోనే జరిగింది..

* స్కూల్ సెలవుల సమయంలో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటిస్తున్న సినిమా షూటింగ్ లకి వెళ్ళేవాడు.. అలా సినిమాల వైపు ఆకర్షితుడు అయ్యాడు మహేష్..

* మొత్తం తొమ్మిది సినిమాల్లో బాలనటుడుగా నటించాడు మహేష్.. తన నాలుగవ ఏట దర్శకుడు దాసరి నారాయణ రావు తీసిన నీడ చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయం అయ్యాడు..

* ఆ తర్వాత పోరాటం, శంఖారావం , అన్న-తమ్ముడు, బాలచంద్రుడు, కొడుకు దిద్దిన కాపురం మొదలుగు సినిమాలలో నటించాడు మహేష్.. ఇందులో కొడుకు దిద్దిన కాపురం సినిమాలో ద్విపాత్రాభినయం చేయడం విశేషం..

* ఇక సోలో హీరోగా మహేష్ బాబు రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. మహేష్ బాబుని హీరోగా పరిచయం చేసేందుకు చాలా మంది దర్శకులు ముందుకు వచ్చిన కృష్ణ మాత్రం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి మాత్రమే ఓటు వేశారు.

* అంతకుముందు ఎస్వీ కృష్ణారెడ్డి యమలీల సినిమాని మహేష్ బాబుతోనే చేయాలని అనుకున్నారు. ఆ సమయంలో మహేష్ వయసు చాలా చిన్నది కావడంతో కృష్ణ ఆ ప్రపోజల్ ని పక్కన పెట్టేశారు.

* రాజకుమారుడు సినిమాకి గాను మహేష్ బాబుకి ఉత్తమ నూతన నటుడుగా నంది అవార్డు లభించింది.

* ఇక క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశి దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కు తొలి భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమాతో హీరో కృష్ణ కొడుకు అన్న ఇమేజ్ ని పక్కన పెట్టేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు మహేష్..

* ఇక తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా ప్లాప్ అయినప్పటికీ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు నంది పురస్కారాన్ని ఇచ్చింది.

* ఇక మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలిచిన చిత్రం ఒక్కడు.. గుణశేఖర్ దర్శకత్వంలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది.

* ఇక కొత్తగా మహేష్ ట్రై చేసిన సినిమా నాని.. ఈ సినిమాతో హీరోగా మహేష్ ఫస్ట్ టైం ద్విపాత్రాభినయం చేశాడు. కానీ సినిమా అనుకున్నంతగా విజయాన్ని అందుకోలేదు.

* ఇక మహేష్ కి ఫ్యామిలీ అడియన్స్ కి దగ్గర చేసిన సినిమా అతడు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి గాను మహేష్ కి నంది అవార్డు లభించింది.

* ఇక మహేష్ కెరీర్ లో మరో టర్నింగ్ పాయింట్ పోకిరి.. ఇది మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మూవీ.. అప్పటివరకు ఉన్న బాక్స్ ఆఫీస్ కలెక్షన్లును బద్దలు కొట్టి రికార్డు సృష్టించింది ఈ చిత్రం..

* ఆ తర్వాత మహేష్ చేసిన సినిమాలు పెద్దగా హిట్ కాలేదు.. కొంచం గ్యాప్ తీసుకొని చేసిన ఖలేజా కూడా నిరశాపరిచింది.

* ఇక మళ్ళీ మహేష్ స్టార్ డంని చూపించిన చిత్రం దూకుడు.. మహేష్ కూడా కామెడీ చేయగలడు అని చూపించిన సినిమా ఇదే కావడం విశేషం..

* సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మరోసారి ఫ్యామిలీ ఆడియన్స్ ని టచ్ చేశాడు మహేష్..

* కమర్షియల్, మెసేజ్ లతో కలిపి సినిమాలు చేయడం మొదలు పెట్టాడు మహేష్.. అందులో భాగంగా వచ్చిన చిత్రమే శ్రీమంతుడు.. ఈ సినిమా తర్వాత భరత్ అను నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు లాంటి మెసేజ్ కం కమర్షియల్ యాంగిల్ లో చిత్రాలను చేశాడు మహేష్..

* మహేష్ వంశి సినిమా చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ నటి మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరి కుమారుడు గౌతమ్ కృష్ణ. కుమార్తె సితార ఉన్నారు.

* శ్రీమంతుడు సినిమా చేశాక తన సొంత గ్రామం బుర్రిపాలెం గ్రామంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో మరో గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు మహేష్

* ఎంతో మంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించాడు మహేష్..

* ఇక సినిమాల్లో ఇప్పటి యంగ్ హీరోలు ఎవరు చేయని వైవిధ్యమైన పాత్రలను చేశాడు మహేష్..

* ఎన్నో యాడ్స్ గా మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు మహేష్..

* మహేష్ బాబు తన అన్నయ్య రమేష్ బాబు, తండ్రి కృష్ణ, కొడుకు గౌతమ్ కృష్ణతో కలిసి నటించారు.

ఇలా మహేష్ బాబు మరెన్నో సినిమాల్లో నటించాలని, ఆ సినిమాలతో ప్రేక్షకులను మరింతగా మెప్పించాలని కోరుకుంటూ మహేష్ బాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది HMTV

Show Full Article
Print Article
Next Story
More Stories