దిల్ రాజుకు కుమార్తె హన్షిత విషెస్!

దిల్ రాజుకు కుమార్తె హన్షిత విషెస్!
x
Highlights

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో వివాహం చేసుకున్నారు. నిజామాబాద్‌లోని స్వగ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి 11:30...

ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు ఆదివారం రాత్రి రెండో వివాహం చేసుకున్నారు. నిజామాబాద్‌లోని స్వగ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి 11:30 గంటలకు దిల్ రాజు వివాహం జరిగింది. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో అత్యంత నిరాడంబంరంగా ఈ పెళ్లి జరిగింది. మూడేళ్ల క్రితం దిల్ రాజు భార్య అనిత.. అనారోగ్యంతో 2017లో మరణించింది. దిల్ రాజు కూతురు హన్షిత రెడ్డి నాన్నకు ఎలాగైనా మళ్ళీ పెళ్లి చేయాలని అనుకుంది. ఆ బాధ్యతను భుజాన వేసుకొని పెళ్లి పెద్దగా వ్యవహచింది. కూతురు హన్షిత రెడ్డి తండ్రికి నోట్ ద్వారా శుభాకాంక్ష‌లు అందించింది.

డియర్ డాడ్... అన్ని సమయాల్లోనూ నువ్వే నా బలం. అనుక్షణం నాకు అండగా ఉన్నందుకు ధన్యవాదాలు. మన కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి ఎంతో కృషి చేశావు. జీవితంలో కొత్త ప్రయాణం ప్రారంభించిన మీరిద్దరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. ప్రతి రోజూ నీకు అద్భుతంగా ఉండాలని కోరుకుంటున్నా. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా ఐ లవ్ యూ ఏ లాట్... యువర్స్ హన్షు అంటూ దిల్ రాజుకు ఆయన కుమార్తె హన్షిత రెడ్డి మ్యారేజ్ విషెస్ తెలిపారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories