Bigg Boss 8 Telugu: గంగవ్వకు గుండెపోటు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలో నిజమెంత?

Bigg Boss 8 Telugu: గంగవ్వకు గుండెపోటు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్తలో నిజమెంత?
x
Highlights

Bigg Boss 8 Telugu: గంగవ్వ ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు వ్యవసాయ కూలీ అయిన గంగవ్వ.. ఇప్పుడు అతి పెద్ద సెలబ్రిటీగా మారింది.

Bigg Boss 8 Telugu: గంగవ్వ ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు వ్యవసాయ కూలీ అయిన గంగవ్వ.. ఇప్పుడు అతి పెద్ద సెలబ్రిటీగా మారింది. మై విలేజ్ షో అనే ఛానెల్ లో పల్లెటూరి వీడియోలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. అరవై ఏళ్ల వయసులో కూడా చలాకీగా వీడియోలు చేస్తూ.. గలగలా మాట్లాడే గంగవ్వ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది. అదే పాపులారిటీ తో బిగ్ బాస్‌లో అడుగుపెట్టే అవకాశం దక్కించుకుంది.

ప్రస్తుతం బిగ్ బాస్ షో ఎనిమిదవ సీజన్ నడుస్తోంది. ఈ షోలో పద్నాలుగు మంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. అయితే షోలో కొందరు ఎలిమినేట్ కాగా.. ఆరవ వారం వైల్డ్ కార్డు ద్వారా ఎనిమిది మంది మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి తీసుకొచ్చారు. సీజన్-4లో అనుకోని పరిస్థితుల కారణంగా షో మధ్యలోనే వెళ్లిపోయిన గంగవ్వకు.. బిగ్ బాస్ మరోసారి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ గా మళ్లీ ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. ఇక వచ్చిన మొదటి రోజే అవినాష్‌తో టాస్క్ ఆడి గెలిచి సూపర్ అనిపించుకుంది. టాస్కుల్లో పెద్దగా ఆడకపోయినా తన శక్తికి తగట్టు అక్కడక్కడ కామెడీ, పంచులు వేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది గంగవ్వ.

అయితే వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ.. ఓ పక్క బిగ్ బాస్ హౌస్ లో తన గేమ్ తో అదరగొడుతుంటే.. మరో పక్క ఆమెకు గుండెపోటు వచ్చిందంటూ సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అయింది. అంతేకాదు కంటెస్టెంట్స్ అందరూ భయాందోళనకు గురయ్యారని.. డాక్టర్స్ టీమ్ హౌస్ లోకి వెళ్లి సరైన సమయంలో వైద్యం అందించారంటూ వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా ఈ న్యూస్ మీద మై విలేజ్ షో టీం సభ్యుడు అంజిమామ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం పై తాము షో నిర్వాహకులకు కాల్ చేశామని, అలాంటిది ఏమీ లేదంటూ చెప్పారని తెలిపారు. దీంతో గంగవ్వకు గుండెపోటు వచ్చిందంటూ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్న న్యూస్ పూర్తిగా ఫేక్ అని తేలింది.

Show Full Article
Print Article
Next Story
More Stories