ఆహాలో అదరగొడుతోన్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల'.. వచ్చేవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లోనూ..

ఆహాలో అదరగొడుతోన్న ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల.. వచ్చేవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లోనూ..
x
Highlights

ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై కొవ్వూరి అరుణ సమర్పణలో వచ్చిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143'.

ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్ జంటగా బ్లాక్ ఆంట్ పిక్చర్స్ పతాకంపై కొవ్వూరి అరుణ సమర్పణలో వచ్చిన చిత్రం ‘ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు-500143'. ఓ యదార్థ సంఘటన ఆధారంగా శ్రీనాథ్ పులకురం ఈ చిత్రానికి తెరకెక్కించారు. భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. జూన్ 21న విడుదలైన ఈ చిత్రం యూత్, ఫ్యామిలీ ప్రేక్షకుల మనసును దోచుకుంది. థియేటర్లో ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించేందుకు వచ్చేసింది. ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. వచ్చే వారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులో ఉండబోతోంది. అంతా కొత్త వారితో చేసిన ఈ చిన్న చిత్రానికి థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం ఆకట్టుకుంటోంది. ఆహాలో ఈ మూవీ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

ఈ చిత్రం ప్రస్తుతం ఆహాతో పాటుగా యూఎస్ ఆడియెన్స్ కోసం అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక వచ్చే వారం నుంచి ఇండియన్ ఆడియెన్స్ కోసం ఆహాతో పాటుగా అమెజాన్ ప్రైమ్‌లోనూ స్ట్రీమింగ్ కానుంది.

ప్రతీ మనిషికి తొలి ప్రేమ ఎంతో మధురంగా, గుండెల్లో పదిలంగా ఉంటుంది. అలాంటి ఓ అందమైన తొలి ప్రేమను ప్రభుత్వ జూనియర్ కళాశాల చిత్రంలో చూపించారు. ఇంటర్మీడియట్ రోజులు.. తొలి ప్రేమ.. విరహ వేదనలు.. ఇలా అన్ని అంశాలతో కుర్రకారుని కట్టి పడేసేలా ఓ అందమైన ప్రేమ కావ్యాన్ని చూపించారు.

‘థియేటర్‌లో యూత్‌ని ఆకర్షించిన మా సినిమా ఇప్పుడు ‘ఆహా’లో ఫామిలీ ప్రేక్షకుల ప్రసంశలు పొందుతోంది. ఓటీటీలో విడుదల అయిన తర్వాత చాలామంది ఫోన్ చేసి సినిమా చాలా బాగుంది అని చెప్తున్నారు. మరో వారం తరువాత అమెజాన్ ప్రైమ్‌లో కూడా స్ట్రీమింగ్ కానుంది’ అని దర్శక నిర్మాతలు తెలిపారు.

ఈ సినిమాలో ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల నటించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories