Pankaj Udhas: గజల్‌ గాయకుడు పంకజ్‌ ఉదాస్‌ కన్నుమూత

Ghazal Singer Pankaj Udhas Passes Away At 73 After Prolonged Illness
x

Pankaj Udhas: గజల్‌ గాయకుడు పంకజ్‌ ఉదాస్‌ కన్నుమూత

Highlights

Pankaj Udhas: ఆయన లేని లోటు తీర్చలేనది అంటున్న సంగీతాభిమానులు

Pankaj Udhas: సుప్రసిద్ధ గజల్‌ గాయకుడు పంకజ్‌ ఉదాస్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. పంకజ్‌ ఉదాస్‌ను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతీయ సంగీత ప్రపంచంలో గజల్‌, నేపథ్య గాయకుడిగా పంకజ్‌ ఎన్నో అద్భుతమైన పాటలను ఆలపించారు. ముఖ్యంగా హిందీలో ఆయన పాడిన పాటలు అజరామరం. 1980లో ‘ఆహత్’ అనే గజల్ ఆల్బమ్‌ ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టింది.

ఆ తర్వాత ముకరర్, తర్రన్నమ్‌, మెహ్‌ఫిల్, నయాబ్ వంటి అనేక హిట్‌లను అందించారు. పంకజ్‌ ఉదాస్‌ గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో జన్మించారు. కేశుభాయ్‌ ఉదాస్‌, జితూబెన్‌ ఉదాస్‌ తల్లిదండ్రులు. వీరికి ముగ్గురు సంతానం. అందరిలో చిన్నవాడు పంకజ్‌. సోదరుడు మన్హర్‌ ఉదాస్‌ కూడా పలు బాలీవుడ్‌ చిత్రాల్లో పాటలు పాడారు. ఆయన రెండో సోదరుడు నిర్మల్‌ ఉదాస్‌ గజల్‌ గాయకుడు. ఇలా సోదరులు ఇద్దరూ గాయకులు కావడంతో పంజక్‌ కూడా అదే బాటలో పయనించారు. తనకు చిన్నప్పటి నుంచి డాక్టర్‌ కావాలని ఉండేదని, అయితే సంగీతంపై ఆసక్తి పెరగడంతో గాయకుడిగా మారినట్లు పంకజ్‌ ఆయన సన్నిహితులతో చెప్పేవారు.

Show Full Article
Print Article
Next Story
More Stories