Shriya kontham: గ్యాంగ్‌ లీడర్‌ మూవీ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా? చూస్తే షాక్‌ అవ్వాల్సిందే!

Gang Leader artist Shriya Kontham
x

Shriya kontham: గ్యాంగ్‌ లీడర్‌ మూవీ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా? షాక్‌ అవ్వాల్సిందే!

Highlights

Gang Leader artist Shriya Kontham: నాని హీరోగా వచ్చిన గ్యాంగ్‌ లీడర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ మంచి...

Gang Leader artist Shriya Kontham: నాని హీరోగా వచ్చిన గ్యాంగ్‌ లీడర్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చిన్న సినిమాగా వచ్చిన ఈ మూవీ మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. అయితే కమర్షియల్‌‌గా పెద్ద విజయాన్ని నమోదు చేసుకోలేకపోయినా మంచి సినిమాగా పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా నాని నటన, ఉమెన్ సెంట్రిక్‌ కథాంశాన్ని దర్శకుడు అద్భుతంగా చూపించిన తీరు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

తమ కుటుంబ సభ్యులను చంపిన విలన్‌ కోసం కొందరు మహిళలతో నానితో జతకట్టి ఏం చేశారన్న కథంశాన్ని దర్శకుడు అద్భుతంగా చూపించాడు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాని గతంలో ఎన్నడూ కనిపించిన వినూత్న పాత్రను పోషించాడు. రైటర్‌గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. నానికి జోడిగా కనిపించిన ప్రియాంక మోహన్‌ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. తన క్యూట్‌ నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

ఈ సినిమా తర్వాతే ప్రియాంకకు తెలుగులో క్రేజ్‌ వచ్చింది. కాగా హీరోయిన్‌తో పాటు ఈ సినిమాలో నటించిన మిగతా మహిళలకు కూడా మంచి గుర్తింపు లభించింది. వీరిలో టీనేజ్‌ అమ్మాయిగా నటించి మెప్పించింది శ్రియా కొంతం. అన్నయ్యను కోల్పోయిన అమ్మాయిగా ఈ సినిమాలో కనించింది. అయితే ఇప్పుడు శ్రియా మేకోవర్‌ పూర్తిగా మారిపోయింది. హీరోయిన్‌ రేంజ్‌కు చేరిపోయింది.

గ్యాంగ్‌ లీడర్‌ మూవీ తర్వాత నటనకు బ్రేక్‌ ఇచ్చి స్టడీపై దృష్టిసారించింది. అయితే సోషల్‌ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్‌గా ఉంటోంది. తన లేటెస్ట్‌ ఫొటోలను ఎప్పటికప్పుడు నెటిజన్లతో షేర్‌ చేసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేసింది. దీంతో ఇప్పుడీ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. హీరోయిన్స్‌కి ఏమాత్రం తగ్గని అందంతో కట్టి పడేస్తోంది. అటు ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపిస్తూనే మరోవైపు ట్రెండీ డ్రస్‌లలో గ్లామర్‌గా కనిపిస్తూ కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతోంది. తాజాగా నెట్టింట వైరల్‌ అవుతోన్న కొన్ని ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

Show Full Article
Print Article
Next Story
More Stories