Gaali Sampath: 'గాలి సంపత్' రివ్యూ

Gaalisampath review
x

గాలి సంపత్ ఇమేజ్ (thehansindia)

Highlights

Gaali Sampath: 'గాలి సంపత్ ' ద్వితీయార్ధంలో భావోద్వేగాల‌కి పెద్ద‌పీట వేశారు.

Gaali Sampath: శ్రీవిష్ణు, రాజేంద‌ప్ర‌సాద్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా.. సూపర్ హిట్ చిత్రాల డైరెక్టర్‌ అనిల్ రావిపూడి సమర్పకుడిగా, ఆ‍యన స్క్రీన్‌ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన చిత్రం'గాలిసంప‌త్'. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం(మార్చి11) ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. విడుదలకు ముందు నుంచే ఈ సినిమా ప్రేక్ష‌కుల దృష్టిని ప్ర‌ముఖంగా ఆక‌ర్షించింది. దీంతో సినిమాపై అంచ‌నాలు మ‌రింత‌గా పెరిగాయి. ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాలి సంపత్‌ ఎలా ఉందో తెలుసుకుందాం?

క‌థ:

గాలిసంప‌త్ (రాజేంద్ర‌ప్ర‌సాద్‌)కి మాటలు రావు. గాలితో ఫిఫి భాష మాట్లాడుతుంటాడు. 'గాలిసంప‌త్ 'తన కొడుకు సూరి (శ్రీవిష్ణు)తో క‌లిసి జీవిస్తుంటాడు. గాలిసంప‌త్ భాష అర్థ‌మ‌య్యేలా చెప్పేందుకు ప‌క్క‌న ట్రాన్స్‌లేట‌ర్‌గా (స‌త్య‌) కూడా ఉంటాడు. ఈ క్ర‌మంలో తండ్రీ కొడుకుల మధ్య చిన్న తగువులు చోటుచేసుకుంటాయి. అయితే అనుకోకుండా గాలి సంపత్ ఇంటి ప‌క్క‌నున్న నూతిలో ప‌డిపోతాడు. నోటి నుంచి మాట రాని సంప‌త్ 30 అడుగుల నూతిలో నుంచి ఎలా బ‌య‌టికొచ్చాడు? త‌న తండ్రి జాడ తెలుసుకోవడానిక కోడుకు ఏం చేస్తాడు? గాలిసంపత్ మాటలు పడిపోవడానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎవ‌రెలా చేశారంటే:

ఫస్ట్ ఆఫ్ సినిమా అక్క‌డ‌క్క‌డా న‌వ్వులు పంచుతూ సాగుతుంది. ద్వితీయార్ధంలో భావోద్వేగాల‌కి పెద్ద‌పీట వేశారు. ఈ సినిమా 'గాలి సంపత్ 'గా రాజేంద్ర‌ప్ర‌సాద్, సూరి (శ్రీవిష్ణు) పాత్ర‌లు చాలా కీలకం. రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు తండ్రీ కొడుకులుగా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇద్దరూ ఎమోషనల్ సీన్స్ చక్కగా పండించారు. ముఖ్యంగా రాజేంద్ర‌ప్ర‌సాద్ అనుభవం ఈ సినిమాకి ప్లాస్ పాయింట్. ఆయన పలికించే హావ‌భావాలు, అక్క‌డ పండించిన భావోద్వేగాలు ప్రేక్షకుల మ‌న‌సుల‌కి హత్తుకునేలా ఉంటాయి. ఇక శ్రీవిష్ణు తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ఫ

భావోద్వేగాలు పండించడంతో ఆయనకు సాటిలేదని నిరూపించుకున్నాడు. హీరోయిన్ పాత్ర విషయానకి వస్తే..ల‌వ్‌లీ సింగ్ హీరోతో లవ్ ట్రాక్ కోసమే పెట్టినా పెద్దగా ప్రాధాన్యత లేదు. పాటలకు మాత్రమే పరిమితం అయ్యింది. సినిమాలో ల‌వ్‌లీ సింగ్ పాత్ర‌కి పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. తన పాత్ర పరిథి మేరకు బాగానే నటించింది. కొన్ని సీన్స్ చాలా బ్యూటీఫూల్ గా క‌నిపించింది. ట్రాన్స్‌లేట‌ర్‌గా స‌త్య ప్ర‌థ‌మార్ధంలో బాగా హాస్యం పండించాడు. శ్రీనివాస్‌రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్‌, అనీష్ కురువిల్లా, ర‌ఘుబాబు, ర‌జిత వారివారి పాత్ర‌ల ప‌రిధి మేర‌కు బాగా నటించారు.

సాంకేతికంగా..

సాయి శ్రీరామ్ కెమెరా అర‌కు అందాల్ని చక్కగా బంధించారు. అచ్చు రాజ‌మ‌ణి బాణీలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే నేపథ్య సంగీతం సినిమాపై బ‌ల‌మైన ప్ర‌భావ‌మే చూపించింది. ఎస్‌.కృష్ణ రాసిన క‌థలోనైతే కొత్త‌ద‌నం క‌నిపిస్తుంది. అయినప్పటీకి చాలా సీన్స్ ప్రేక్షకులడి ఊహ‌కు త‌గ్గ‌ట్టే కనసాగుతుంటాయి. అనిల్ రావిపూడి స్క్రీన్‌ప్లే మెరుపులు అక్క‌డ‌క్క‌డా క‌నిపిస్తాయి. దీంతొ దర్శకుడు అనీష్ పని సులభమైంది. నిర్మాణ విలువల్లో ఎక్కడా లోపాలు కనిపించవు. మొత్తంగా చెప్పాలంటే సాంకేతిక వర్గాల పనితీరు బాగుంది.

మొత్తానికి గాలి సంప‌త్ థియేటర్లో కామెడీ, ఎమోషన్స్‌ తో ప్రేక్షకులకు కాల‌క్షేపం చేస్తాడు.

గమనిక: ఈ రివ్యూ సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే!

Show Full Article
Print Article
Next Story
More Stories