అనురాగ్‌ కశ్యప్‌ కు ఇద్దరు మాజీ భార్యల మద్దతు!

అనురాగ్‌ కశ్యప్‌ కు ఇద్దరు మాజీ భార్యల మద్దతు!
x

Anurag Kashyap

Highlights

Anurag Kashyap : బాలీవుడ్‌ టాప్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ లైంగిక ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే.. నటి పాయల్‌ ఘోష్

Anurag Kashyap : బాలీవుడ్‌ టాప్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ లైంగిక ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే.. నటి పాయల్‌ ఘోష్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనురాగ్‌ కశ్యప్‌ చెప్పి ఇంటికి రమ్మని చెప్పి చాలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆరోపణలు చేసింది.. ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.. అయితే తాప్సీ పొన్ను, రాధికా ఆప్టే, రామ్ గోపాల్ వర్మ, అనుభవ్ సిన్హా, సుర్వీన్ చావ్లా, టిస్కా చోప్రా, సాయాని గుప్తా మొదలగు వారు మాత్రం దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌కు మాత్రమే మద్దతు పలుకుతున్నారు.

తాజాగా అనురాగ్‌ కశ్యప్‌ మాజీ భార్యలు ఇద్దరు అతనే మద్దతు ఇచ్చారు. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో నటి కల్కి కొచ్లిన్ సుదీర్ఘమైన పోస్టు పెట్టారు. ఇందులో ఆమె.. " డియర్ అనురాగ్.. సోషల్ మీడియాలో మీ పైన వస్తున్న వార్తలను పట్టించుకోకండి.. వ్యక్తిగతంగా మీరు మహిళలను ఎంత సమర్ధిస్తారనే దానికి నేనే ప్రత్యక్ష సాక్షిని.. మన విడాకుల తర్వాత కూడా మీరు చాలా చిత్తశుద్ధితో నిలబడ్డారు. నేను నా వర్క్ ప్లేస్ లో అసౌకర్యానికి అసురక్షితకు లోనైనప్పుడు కూడా మీరు నాకెంతో సపోర్ట్ గా నిలిచారు. ఏది ఏమైనా మీరు ధైర్యంగా ఉండండి. మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి" అంటూ పోస్ట్ పెట్టింది.

ఇక అనురాగ్ మొదటి మాజీ భార్య ఆర్తి బజాజ్ కూడా మద్దతు తెలుపుతూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది. " సోషల్ మీడియాలో మీ పైన వస్తున్న వార్తలను చూసినప్పుడు నాకు ముందుగా కోపం వచ్చింది. మీరు మరింత గట్టిగా మీ గొంతును వినిపించండి" అంటూ పోస్ట్ చేసింది. అయితే అనురాగ్ నుండి విడాకుల తీసుకున్న ఇద్దరు మహిళలు కూడా అతనికి సపోర్ట్ గా నిలవడం అతని క్యారక్టర్ ని తెలియజేస్తోంది అంటూ పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories