Zakir Hussain's Health Condition: ఐసీయూలో జాకీర్ హుస్సేన్

Zakir Hussains Health Condition: ఐసీయూలో జాకీర్ హుస్సేన్
x
Highlights

Zakir Hussain's Health Condition: ప్రముఖ తబలా మేస్ట్రో జాకీర్ హుస్సేన్ అనారోగ్యంతో ఐసీయూలో చేరారు. జాకీర్ హుస్సేన్ ప్రస్తుతం అమెరికాలోని శాన్...

Zakir Hussain's Health Condition: ప్రముఖ తబలా మేస్ట్రో జాకీర్ హుస్సేన్ అనారోగ్యంతో ఐసీయూలో చేరారు. జాకీర్ హుస్సేన్ ప్రస్తుతం అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉంటున్నారు. ఆదివారం ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. జాకీర్ హుసేన్ స్నేహితుడు, ఫ్లాటిస్ట్ రాకేష్ చౌరాసియా ఈ విషయాన్ని పీటీఐకి తెలిపారు. ఇదే విషయమై పీటీఐ కూడా ఒక వార్తా కథనాన్ని ప్రచురించింది.

జాకీర్ హుసేన్ వయస్సు 73 ఏళ్లు. ఆయన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఆయన పరిస్థితి చూస్తోంటే ఆందోళనకరంగానే ఉందని రాకేష్ చౌరాసియా చెప్పారు.

ప్రముఖ తబలా మాంత్రికుడిగా జాకీర్ హూసేన్ కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రపంచం నలుమూలలా ఆయన ఎన్నో లైవ్ కన్సర్ట్యస్ ఇచ్చారు. తబలపై ఆయన చేతి వేళ్లు నాట్యం చేస్తోంటే చూడ్డానికి, ఆ తబలా వాయిద్యం వినడానికి ఆసక్తి చూపే సంగీత ప్రియులకు లెక్కేలేదు. అందుకే జకీర్ హుస్సేన్ ఒక తబలా మేస్ట్రోగా వరల్డ్ వైడ్ పాపులర్ అయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories