"ఎర్రచీర - ది బిగినింగ్" సినిమా ట్రైలర్ లాంఛ్.. ఈ నెల 27న థియేటర్లో రిలీజ్

ఎర్రచీర - ది బిగినింగ్ సినిమా ట్రైలర్ లాంఛ్.. ఈ నెల 27న థియేటర్లో రిలీజ్
x
Highlights

Erra Cheera The Beginning: Erra Cheera - The Beginning: శ్రీ పద్మాలయా ఎంటర్‌టైన్‌మెంట్స్, సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్ర చీర ది బిగినింగ్. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి.

Erra Cheera - The Beginning: శ్రీ పద్మాలయా ఎంటర్‌టైన్‌మెంట్స్, సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్ర చీర ది బిగినింగ్. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తయ్యాయి. గ్రాఫిక్స్ ఎడిటింగ్ చివరి దశ పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అయింది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో పరిచయం కానుంది. దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. సినిమాలో అద్భుతమైన గ్రాఫిక్స్ ఉంటాయని.. 45 నిమిషాల పాటు ఎన్నో ఆసక్తికర సన్నివేశాలు ఉంటాయన్నారు. ఈ సినిమాల్లో తాను కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సుమన్ బాబు వెల్లడించారు.

అద్భుతమైన మదర్ సెంటిమెంట్‌తో పాటు హారర్, యాక్షన్, కామెడీతో ఈ సినిమా అందరినీ అలరించబోతోంది. ఈ సినిమాలో బేబి సాయి తేజస్విని అద్భుతంగా నటించిందని, క్లైమాక్స్‌లో కొత్త సన్నివేశాలతో అద్భుతమైన మదర్ సెంటిమెంట్‌తో అందరినీ కంటతడి పెట్టించేలా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతుంది. ఈ సినిమాలో కారుణ్య చౌదరి కూడా ఓ అద్భుతమైన పాత్రలో నటించనుంది. ఈ నెల 27న "ఎర్రచీర - ది బిగినింగ్" గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శనివారం ఉదయం సినిమా ట్రైలర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన కార్యక్రమంలో ఘనంగా రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నిర్మాత సి.కల్యాణ్ మాట్లాడుతూ - సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories