Tollywood Drugs Case: 12 మంది టాలీవుడ్ తారలకు నోటీసులు జారీ చేసిన ఈడీ

Enforcement Directorate Issued Notices to 12 Tollywood Stars
x

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసులో ఈడీ నోటీసుల ప్రకంపనలు (ఫైల్ ఫోటో)

Highlights

* డ్రగ్స్ సరఫరా, కొనుగోళ్లపై ఆరా తీయనున్న ఈడీ * నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు

Tollywood Drugs Case: సరిగ్గా నాలుగేళ్లకి ముందు టాలీవుడ్ ని అతలాకుతలం చేసిన డ్రగ్స్ కేసు మళ్లీ ఇప్పుడు తెరమీదకి వచ్చింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈసారి ఏకంగా 12 మంది టాలీవుడ్ సెలబ్రిటీస్ కి డ్రగ్స్ ట్రాఫికింగ్ తో సంబంధం ఉందని అని అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 31న ఈడి టాలీవుడ్ లోని టాప్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ ఇన్వెస్టిగేషన్ లో జాయిన్ అవమని పిలుపునిచ్చింది. తాజాగా ఇప్పుడు స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ గా తప్పుకుని ప్రొడక్షన్లో సెటిలైన ఛార్మి కౌర్, నవదీప్, ముమైత్ ఖాన్, తనీష్, తరుణ్, నందులకు పిలుపునిచ్చింది. అంతేకాక రానా దగ్గుబాటి కూడా డ్రగ్స్ తో సంబంధం ఉందని అనుమానాలు వ్యక్తమయ్యాయి.

ఇక ఈ సెలబ్రిటీల పై ఇన్వెస్టిగేషన్ సెప్టెంబర్ 2 నుంచి సెప్టెంబర్ 22 వరకు జరుగుతుంది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారికి ఇన్వెస్టిగేషన్లను చేపట్టామని ఇప్పటికే ఆర్డర్ వేసింది ఈడి. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సెలబ్రిటీలకి వ్యతిరేకంగా ఆధారాలు లేకపోవడం వల్ల పూర్తి చేయలేకపోయింది. ఈ నేపథ్యంలో మాట్లాడుతూ ఒక అధికారి ఇప్పటికే 11 చార్జిషీట్లు ఫైల్ అయ్యాయని, ఇన్వెస్టిగేషన్ కోసం ఎనిమిది మంది ఇంచార్జి లను నియమించామని, కానీ వారంతా లోవర్ లెవెల్ ట్రాఫికర్లు మాత్రమే అని అన్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 6న రకుల్, సెప్టెంబర్ 8న రానా దగ్గుబాటి, సెప్టెంబర్ 9న రవి తేజ మరియు తదితరులు ఇన్వెస్టిగేషన్లో పాల్గొననున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories