Tollywood Drugs Case: డ్రగ్స్ లావాదేవీలపై ఈడీ దృష్టి

Enforcement Directorate Focus is on Drug Transactions
x

ఎన్ఫోర్స్మెంట్  డైరెక్టరేట్ (ఫైల్ ఫోటో)

Highlights

* 2017లో కెల్విన్ అరెస్ట్‌తో వెలుగులోకి * 30 లక్షల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్

Tollywood Drugs Case: టాలీవుడ్‌లో డ్రగ్స్ లావాదేవీలపై ఈడీ దృష్టి సారించింది. నిధులు విదేశాలకు ఎలా మళ్లించారన్న దానిపై ఈడీ విచారణ చేయనుంది. గతంలో సరఫరా, వాడకంపై మాత్రమే ఎక్సైజ్‌శాఖ దృష్టి పెట్టింది. 2017లో కెల్విన్ అరెస్ట్‌తో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. 30 లక్షల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. షికాగో ఇంటర్నేషనల్ డ్రగ్స్ రాకెట్‌తో సంబంధాలు ఉన్నట్లు కూడా గుర్తించారు.

ఆస్ట్రియా, దక్షిణాఫ్రికా నుంచి సైతం డ్రగ్స్ సప్లై చేసుకున్నట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. డార్క్‌నట్ వెబ్‌సైట్‌తో పాటు మరో రెండు కొరియర్ సంస్థలతో డ్రగ్స్‌ సప్లై చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. ఎక్సైజ్‌శాఖ నుంచి వివరాలు తీసుకొని విచారించనుంది ఈడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories