Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ దూకుడు

Enforcement Directorate Collects Key Information in the Inquiry of Tollywood Actors
x

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈడీ దూకుడు 

Highlights

* సినీ ప్రముఖుల నుంచి కీలక విషయాలు ఆరా * బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు

Tollywood Drugs Case: తెలుగు రాష్ట్రాల్లో ఈడీ కేసులన్నీ సంచలనం సృష్టించినవే. జగన్‌ అక్రమాస్తుల కేసు, గాలి జనార్ధన్‌ రెడ్డి కేసు, లోన్‌ యాప్స్‌ వంటి వాటిని ఈడీ విచారించింది. అయితే ఈ కేసుల్లోఆస్తులు జప్తు చేయడం తప్ప నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదనే విమర్శలు ఉన్నాయి. కాగా ఈ కేసులన్నీ కోర్టులో పెండింగ్‌లోనే ఉన్నట్లు సమాచారం.

జగన్‌ అక్రమాస్తుల విషయంలో మనీలాండరింగ్‌తోపాటు వివిధ మనీ చట్టాల ఉల్లంఘనకు సంబంధించి ఈడీ కూడా కేసులు నమోదు చేసి విచారణ చేపట్టింది. అనేక ఆస్తులను అటాచ్‌ చేయగా.. అటాచ్‌ చేసిన ఆస్తులను చాలా వరకు మినహాయింపు ఇచ్చారు. అయితే జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక రిలాక్సేషన్‌ వచ్చింది. ఇక ఓబుళాపురం మైనింగ్‌ కేసుతోపాటు పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న కర్ణాటక బీజేపీ నేత గాలిజనార్ధన్‌ రెడ్డి కేసు కూడా ఇంకా కోర్టులోనే ఉంది.

ఇటీవల డ్రగ్స్‌ కేసులో సినీతారలు మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. అయితే ఇంటరాగేషన్‌ పూర్తయిన తర్వాత ఆధారాలన్నీ కోర్టులో సబ్మిట్ చేస్తారు. అటు ఈడీ అధికారులు ఫైల్‌ చేసిన కేసులకు పక్కా ఆధారాలు ఉంటాయి కానీ కోర్టు తీర్పు ఆలస్యం కావడంతో నిందితులకు సకాలంలో శిక్ష పడటం లేదని తెలుస్తోంది. మొత్తానికి టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసును ఈడీ మళ్లీ తెరపైకి తీసుకువచ్చి విచారణ చేపట్టింది. సినీ ప్రముఖుల నుంచి కీలక విషయాలను రాబనట్టు తెలుస్తోంది. కాగా.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ ప్రముఖుల నేరం రుజువు అయితే శిక్ష పడుతుందా..? లేదా అనే విషయంపై ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories