Encounter Movie For 23 Years : చావు బతుకుల మధ్య ఆ సినిమాలు చేశా.. 'ఎన్‌కౌంటర్‌' శంకర్

Encounter Movie For 23 Years : చావు బతుకుల మధ్య ఆ సినిమాలు చేశా.. ఎన్‌కౌంటర్‌ శంకర్
x
Director shankar (File Photo)
Highlights

Encounter Movie For 23 Years : సినిమా పేర్లనే వారి ఇంటిపేర్లు చేసుకున్న దర్శకులు చాలా తక్కువేనని చెప్పాలి.. అందులో ఒకరు ‘ఎన్‌కౌంటర్‌’ శంకర్ ..

Encounter Movie For 23 Years : సినిమా పేర్లనే వారి ఇంటిపేర్లు చేసుకున్న దర్శకులు చాలా తక్కువేనని చెప్పాలి.. అందులో ఒకరు 'ఎన్‌కౌంటర్‌' శంకర్ ..అయన మొదటి సినిమా 'ఎన్‌కౌంటర్‌'... కృష్ణ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ఈ సినిమా 1997లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి నేటితో 23(ఆగస్టు 14) ఏళ్ళు నిండాయి.. అంతేకాకుండా అయన దర్శకత్వంలోనే 1998లో తెరకెక్కిన శ్రీరాములయ్య సినిమాకి కూడా ఇదే రోజున విడుదలైంది. ఈ సినిమాకి నేటితో 22 ఏళ్ళు నిండాయి.. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించిన విశేషాలను ఓ ప్రముఖ పత్రికతో పంచుకున్నారు దర్శకుడు శంకర్.

అయన మొదటి సినిమాని బాలకృష్ణతో చేద్దామని అనుకున్నారట దర్శకుడు శంకర్.. కానీ తన ఊరికి దగ్గరలో ఓ 22 ఏళ్లలోపున్న నలుగురు కుర్రాళ్లు ఎన్‌కౌంటర్‌కి గురయ్యారన్న విషయం ఆయనకి బాగా కదిలిచిందట.. దీనితో అయన దీనిని నుంచి స్ఫూర్తి పొంది ఇదే అంశం పైన మొదటి చిత్రాన్ని తెరకెక్కించారట.. ఈ సినిమాని పోలీసుల పర్యవేక్షణలొనే తీసినట్టుగా ఆ ఇంటర్వ్యూలో శంకర్ వెల్లడించారు. ఈ సినిమా కథని తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కూడా చెప్పినట్టుగా శంకర్ వెల్లడించారు. ఇక ఈ సినిమాని పట్టాలెక్కించడంలో చాలా సమస్యల్ని ఎదురుకున్నట్టుగా శంకర్ చెప్పుకొచ్చారు.

ఇక మోహన్ బాబు, హరికృష్ణ, సౌందర్య ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన శ్రీరాములయ్య సినిమా గురించి అయన మాట్లాడుతూ... ఈ సినిమా చేస్తున్నప్పుడు చాలా బెదిరింపులు వచ్చాయని అన్నారు. ఇక చావు బతుకుల మధ్య ఈ రెండు సినిమాలు చేసినట్టుగా శంకర్ వెల్లడించారు. ఇక సునీల్ హీరోగా వచ్చిన టూ కంట్రీస్ సినిమా తర్వాత మళ్ళీ సినిమాలను చేయలేదు శంకర్.

Show Full Article
Print Article
Next Story
More Stories