Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ నుండి పారిపోయిన ఏనుగు

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్ నుండి పారిపోయిన ఏనుగు
x
Highlights

Vijay Deverakonda's Next Movie: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా VD12 షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. కొత్తమంగళం సమీపంలోని...

Vijay Deverakonda's Next Movie: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా VD12 షూటింగ్ ప్రస్తుతం కేరళలో జరుగుతోంది. కొత్తమంగళం సమీపంలోని బూతతంకెట్టు అటవీ ప్రాంతంలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం రెండు ఏనుగులు అద్దెకి తీసుకున్నారు. ఆ రెండు ఏనుగులు అనుకోకుండా ఘర్షణకు దిగడంతో అక్కడ గందరగోళమైన వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే పుతుప్పల్లి సాధు అనే అనే 57 ఏళ్ల ఏనుగు అడవిలోకి పారిపోయింది. శుక్రవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

పారిపోయిన ఏనుగు కోసం అటవీ శాఖ అధికారులు శుక్రవారం రాత్రి వరకు తీవ్రంగా గాలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే చీకటి పడటం, అటవీ ప్రాంతం కావడంతో ఏనుగు కోసం వెతకడం ఆపేసి మళ్లీ శనివారం ఉదయమే సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఆ తరువాతే పారిపోయిన ఏనుగు ఆచూకీ లభించింది.

జెర్సీ మూవీ ఫేమ్ గౌతం తిన్ననూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇది విజయ్ దేవరకొండ కెరీర్లో 12వ సినిమా కావడంతో ప్రస్తుతానికి దీనిని VD12 అనే పిలుస్తున్నారు.

జెర్సీ మూవీ బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరిలో నేషనల్ అవార్డ్, అలాగే బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో సైమా అవార్డ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అలాంటి క్రేజీ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో విజయ్ దేవరకొండ అభిమానుల్లో VD12 మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. మొత్తానికి ఏనుగు పారిపోయిన ఘటనతో విజయ్ దేవరకొండ కొత్త మూవీ షూటింగ్ దశలో ఉండగానే ఈ విధంగా వార్తల్లోకెక్కింది.

Show Full Article
Print Article
Next Story
More Stories