Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ముగిసిన ఈడీ విచారణ

ED Investigation has Completed in Tollywood Drugs Case
x

ముగిసిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు ఇన్వెస్టిగేషన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Tollywood Drugs Case: ఆగస్ట్ 31 నుంచి సప్టెంబర్ 22 వరకు విచారణ * మొత్తం 12 మంది సినీ ప్రముఖులు హాజరు

Tollywood Drugs Case: సినీ తారాల డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ముగిసింది. పూరి జగన్నాధ్ మెుదలుకొని తరుణ్ వరకు 12 మంది సినీ ప్రముఖులను ఈడీ సుదీర్ఘంగా విచారించింది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై సినీ తారలపై ప్రశ్నల వర్షం కురిపించింది. డ్రగ్స్ కేసులో కెల్విన్ సహా ఇతర నిందితులతో ఉన్న సంబంధాలపై ఈడీ ఆరా తీసింది. కానీ.. ఇదే కేసులో చార్జ్‌షీట్ ధాఖలు చేసిన ఎక్సైజ్ శాఖ.. 12 మంది నటులకు క్లీన్‌చిట్ ఇచ్చింది. శరవేగంగా దర్యాప్తు పూర్తి చేసిన ఈడీ.. ఎక్సైజ్‌ శాఖ చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకుంటుందా? లేదా? అనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈడీ విచారణ సినీ తారలకే పరిమతమవుతుందా. రాజకీయ రంగు పూసుకుంటుందా? అనేది సర్వత్రా ఆసక్తి నెలకోంది.

టాలివుడ్ డ్రగ్స్ కేసులో నటుడు తరుణ్ నిన్న ఈడీ విచారణకు హజరయ్యారు. ఉదయం 10 గంటలకు ఈడీ కార్యాలయానికి తనతో పాటు చాటెడ్ అకౌంటెడ్‌తో హాజరయిన తరుణ్‌ను ఈడీ దాదాపు 8 గంటల పాటు సుధీర్ఘంగా విచారించింది. మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో తరుణ్‌ను ఈడీ ప్రశ్నించింది. డ్రగ్స్ కేసులో కీలక నిందితుడు కెల్విన్‌తో పరిచయాలు, అనుమానిత లావాదేవీలపై ఈడీ కూపి లాగింది. తరుణ్ విచారణ కోనసాగుతండగా అతని తండ్రి మరికొన్ని డాక్యూమెంట్లు తీసుకుని ఈడీ కార్యాలయానికి వచ్చారు. గతంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు హాజరయిన తరుణ్‌ను 13 గంటల పాటు విచారించింది. మరోవైపు ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ శాఖ రంగారెడ్డి కోర్టులో ధాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో సినీ తారలకు క్లీన్ చిట్ ఇచ్చింది.

ఇక ఈ కేసులో ఇప్పటివరకు ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు విచారణ ఎదుర్కొన్న 12 మందిలో 10 మందికి తాజాగా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇక హీరో రానా, నటి రకుల్‌కు మాత్రం మొదటి సారిగా ఈడీ అధికారులు సమన్లు జారీ చేసి విచారించారు. ఇప్పటి వరకు విచారించిన సినీ ప్రముఖుల బ్యాంక్ లావాదేవీలు, డ్రగ్స్ పెడ్లర్‌లతో జరిపిన ట్రాన్సక్షన్‌పై ఈడీ దృషి సారించింది. మరోవైపు F లాంజ్ క్లబ్ చుట్టూ డ్రగ్స్ వ్యవహారం తిరుగుతోందని చర్చ నడుస్తోంది. 2015 నుండి 2017 వరకు సాగిన F లాంజ్ పబ్ లో అనేక పార్టీలు, ఈవెంట్స్, పబ్ కు సంబంధించిన బ్యాంక్ ఆడిట్ రీపోర్ట్‌తో పాటు నిర్వాహకులు, జనరల్ మేనేజర్‌లను సైతం ఈడీ ప్రశ్నించింది.

టాలివుడ్ డ్రగ్స్ కేసులో కీలకంగా మారిన ఈడీ దర్యాప్తు.. ఇప్పడు ఎలాంటి మలుపు తిరుగుతుందనే ఉత్కంఠ నెలకోంది. ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ లాగా ఈడీ విచారణ వరకే పరిమితం అవుతందా.. లేదా చర్యలు తీసుకుంటుందా అనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories