Sood Requested : పేదల పాలిట దైవంగా మారిన సోనూసూద్.. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలకు ఓ విజ్ఞప్తి చేశాడు. ఫీజులు కట్టాలని విద్యార్థులను బలవంతం చేయవద్దని కోరాడు.
Sood Requested : పేదల పాలిట దైవంగా మారిన సోనూసూద్.. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల యాజమాన్యాలకు ఓ విజ్ఞప్తి చేశాడు. ఫీజులు కట్టాలని విద్యార్థులను బలవంతం చేయవద్దని కోరాడు. 'పేద విద్యార్థులు ఫీజు డిపాజిట్ చేయనందుకు ఆన్‌లైన్ క్లాసులను నిలిపివేయకండి. ఫీజు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వండి. మీరు చేసే ఆ చిన్న సాయం ఎంతో మంది పిల్లల భవిష్యత్‌ను కాపాడుతుంది. వాళ్లను మంచి మనుషులుగా చేస్తుంది' అని సోనూ ట్వీట్ చేశాడు. ఇక మరో ట్వీట్ లో 'విద్య కంటే గొప్ప విరాళం మరొకటి లేదు. ఫీజుల కోసం చదువుకునే విద్యార్థుల హక్కును హరించవద్దు అని సోనూసూద్ ట్వీట్ చేశాడు.
సోనూసూద్ ట్వీట్ చేసిన 30 నిమిషాల్లో, ఈ పోస్ట్‌ను 10,000 మంది కి పైగా ఇస్తాపడగా, 500 మంది కామెంట్స్ చేశారు. ఇక 2000 మందికి పైగా రీట్వీట్‌లు చేసారు. దీనికి ముందు సోనూసూద్ ని ఒక అమ్మాయి సహాయం కోరింది. తాను చాలా పేదరాలునని, ఫీజు కూడా చెల్లించలేనని పరిస్థితి తనది అని వెల్లిడించింది. అయితే చదువుకోవాలనే కోరిక తనలో చాలా ఉందని, దానికి సహాయం కావాలని సోనూసూద్ ని సహయం కోరింది. ఈ క్రమంలో సోనూసూద్ ఈ పోస్ట్ చేశాడు.
I request all schools & colleges not to force the needy students to deposit their fees.
— sonu sood (@SonuSood) September 28, 2020
Kindly do not stop their online classes. Give them some time to bounce back. A little support from you will save many careers.
This gesture of empathy will make them better humans too 🙏
తన సినిమాల్లో ఎక్కువగా విలన్ గా కనిపించే సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం రియల్ హీరోగా నిలుస్తున్నాడు. లాక్ డౌన్ సమయంలో వలసకూలీల కోసం ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేసి వారిని వారివారి స్వస్థలాలకు చేర్చి వారి పాలిట సోనూసూద్ దేవుడుగా నిలిచాడు.. అంతటితో తన సేవలను ఆపడం లేదు.. కష్టం అనే మాట వస్తే చాలు అక్కడ వాలిపోతున్నాడు. సమస్య కనిపిస్తే చాలు సొల్యూషన్ లాగా కనిపిస్తున్నాడు. దీనితో ఇప్పుడు ఎక్కడ చూసిన సోనూసూద్ పేరే వినిపిస్తోంది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire