Balakrishna: బాలకృష్ణ సినిమాల్లో ఆయన భార్య వసుంధరకు బాగా నచ్చిన సినిమా ఏదో తెలిస్తే.. షాక్ అవ్వడం పక్కా

Balakrishna: బాలకృష్ణ సినిమాల్లో ఆయన భార్య వసుంధరకు బాగా నచ్చిన సినిమా ఏదో తెలిస్తే.. షాక్ అవ్వడం పక్కా
x
Highlights

Balakrishna: బాలకృష్ణ సినిమాలకు చాలా మంది అభిమానులు ఉంటారు. బాలయ్య బాబు సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సందడి మామూలుగా ఉండదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల...

Balakrishna: బాలకృష్ణ సినిమాలకు చాలా మంది అభిమానులు ఉంటారు. బాలయ్య బాబు సినిమా రిలీజ్ అవుతుందంటే ఆ సందడి మామూలుగా ఉండదు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు జై బాలయ్య అంటూ హోరెత్తిస్తుంటారు. మరి బాలయ్య బాబు సినిమాల్లో ఆయన భార్య వసుంధరకు బాగా నచ్చిన సినిమా ఏదో తెలుసుకుందాం. అఖండ సినిమాతో మాంచి సక్సెస్ సాధించిన బాలయ్య బాబు గత సినిమాలతో ఆ ఫామ్ ను మరోసారి కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బాలయ్య 108 సినిమాల్లో నటించారు. వరుసగా సినిమాలతో సక్సెస్ మంత్రం జపిస్తూనే ఉణ్నారు. తన కెరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ తో సందడి చేసిన బాలయ్య బాబు ఈ మధ్య కాలంలో కాస్త జోరు తగ్గించారు. కానీ అఖండ ఇచ్చిన ఊపుతో హ్యాట్రిక్ హిట్ కొట్టాడు.

ప్రస్తుతం మెగా దర్శకుడు బాబి డైరెక్షన్ లో 109 వ సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి డాకు మహారాజ్ అనే పేరు కూడా అనౌన్స్ చేశారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. బాలయ్య బాబు కెరీర్ లో హిట్ ప్లాప్ రెండూ సమానమే. అభిమానులను అలరించడమే బాలయ్య బాబు టార్గెట్. అందుకే రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు బాలయ్య బాబు.

బాలయ్య సినిమాలు అంటే ఆయన అభిమానులు పడిచచ్చిపోతుంటారు. అయితే ఆయన అభిమానులకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయో తెలుసు. కానీ బాలయ్య సినిమాల్లో ఆయన భార్య వసుంధరకు నచ్చే సినిమా ఏదో తెలుసా. బాలయ్య బాబు నటించిన చెన్నకేశవరెడ్డి సినిమా అంటే ఆమెకు చాలా నచ్చుతుందట. 2002లో వి.వి. వినాయక్ డైరెక్షన్ లో వచ్చింది చెన్నకేశవరెడ్డి సినిమా.

ఈ సినిమాలో బాలయ్య బాబుకు జోడిగా టబూ..శ్రియ యాక్ట్ చేశారు. ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రూల్ చేసి అలరించారు. ఈ మూవీ అంటే బాలయ్య భార్య నందమూరి వసుంధరకు చాలా ఇష్టమట. ఈ విషయాన్ని ఆమెను స్వయంగా ఈ సినిమా దర్శకుడు వినాయక్ కు చెప్పారట. ఈ విషయాన్ని వినాయక్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మరి ముఖ్యంగా సీనియర్ బాలయ్య పాత్ర చేస్తున్నన్ని రోజులు బాలయ్య బాబు చాలా ఎంజాయ్ చేస్తూ నటించారట.

Show Full Article
Print Article
Next Story
More Stories