Venkatesh: హీరో వెంకటేశ్ ముగ్గురు కూతుర్లు ఏం చేస్తుంటారో తెలిస్తే..ఫిదా అవుతారు

Venkatesh: హీరో వెంకటేశ్ ముగ్గురు కూతుర్లు ఏం చేస్తుంటారో తెలిస్తే..ఫిదా అవుతారు
x
Highlights

Venkatesh: టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలతో అలరించి ఎంతో అభిమానం సొంతం చేసుకున్నారు....

Venkatesh: టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాలతో అలరించి ఎంతో అభిమానం సొంతం చేసుకున్నారు. వెంకటేశ్ నటించిన ప్రతి సినిమా మహిళలను ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం పలు సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. అయితే ఈ వయసులో కూడా వెంకటేశ్ మంచి ఊపుమీదున్నారు. యువ హీరోలకు గట్టిపోటీనిస్తూ దూసుకువస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం అనే మూవీ వస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా సంక్రాంతి పండగ సందర్బంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అప్డేట్లు ఈ మూవీపై భారీ అంచనాలను పెంచేశాయి. ముఖ్యంగా ఈ మూవీలోని గోదారి గట్టుపై అనే సాంగ్ యూట్యూబ్ లో సంచలనం క్రియేట్ చేసింది. ఎక్కడ చూసినా ఈ పాటే గురించి చర్చించుకుంటున్నారు.

ఇక ఇవన్నీ పక్కనపెడితే వెంకటేశ్ కు మొత్తం నలుగురు సంతానం ఉన్నారు. ముగ్గురు కూతుళ్లు ఒక బాబు ఉన్న విషయం తెలిసిందే. కానీ వెంకటేశ్ కూతుర్లు మాత్రం చిత్రపరిశ్రమకు దూరంగా ఉంటారు. ఇండస్ట్రీలో హీరోలు,హీరోయిన్లు, దర్శక నిర్మాతల కూతురులు, కొడుకులు రాణిస్తుంటే వెంకటేశ్ మాత్రం తన కూతుర్లను సినిమాలకు దూరంగా ఉంచారు. ఫ్యామిలీకి మాత్రం ప్రాధ్యాన్యం ఇచ్చేలా పెంచారు. వెంకటేశ్ కూడా ఎప్పుడూ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో అస్సలు పంచుకోరు. ఆయన ఫ్యామిలీ కూడా మీడియాకు దూరంగానే ఉంటుంది.

వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత ..అందరికీ సుపరిచితమే. పెళ్లికి ముందు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నా పెళ్లి తర్వాత ఆమె ఫుడ్ వ్లాగర్ గా మారారు. రెండవ కూతురు హయవాహిని. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసి...అందులో భాగంగానే ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోనే పనిచేస్తున్నారు. మూడవ కూతురు భావన. డిగ్రీ పూర్తి చేశారు. ఎక్కువ క్రీడారంగంపై ఆసక్తి కనబరుస్తోంది. ఇక వెంకటేశ్ కుమారుడి పేరు అర్జున్. అతనికి సినిమాలపై ఆసక్తి ఉందని త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాలా మంది అభిమానులు మాత్రం వెంకటేశ్ కూతురులను చూసి మురిసిపోతుంటారు. పిల్లలు అంటే ఇలా పద్ధతిగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తుంటారు. ఎంతైనా వెంకీమామ కూతుర్లు కదా ఆమాత్రం పద్దతి ఉండాల్సిందే అంటూ సంబురపడిపోతున్నారు ఆయన అభిమానులు.

Show Full Article
Print Article
Next Story
More Stories