Alia Bhatt: పెళ్లి అయిన ఈ హీరోయిన్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదే..ఒక్కో సినిమాకు 18కోట్ల రెమ్యూనరేషన్

Alia Bhatt: పెళ్లి అయిన  ఈ హీరోయిన్ క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదే..ఒక్కో సినిమాకు 18కోట్ల రెమ్యూనరేషన్
x
Highlights

Alia Bhatt: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పెళ్లి అయిందంటే చాలు అవకాశాలు తగ్గుతుంటాయి. అందుకే చాలా మంది హీరోయిన్లు నాలుగు పదుల వయస్సు వచ్చినా పెళ్లి...

Alia Bhatt: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు పెళ్లి అయిందంటే చాలు అవకాశాలు తగ్గుతుంటాయి. అందుకే చాలా మంది హీరోయిన్లు నాలుగు పదుల వయస్సు వచ్చినా పెళ్లి ముచ్చటే ఎత్తరు. పెళ్లి జరిగి పిల్లలు పుట్టారంటే..వాళ్లు ఫెడావుట్ అవ్వాల్సిందే. కానీ బాలీవుడ్ లో ఈ బ్యూటీ మాత్రం పెళ్లయి ఓ పాప పుట్టిన క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ఒక్కో సినిమాకు కోట్లలో పారితోషికం తీసుకుంటుంది ఈ అమ్మడు. వరుసగా సినిమాలు ఛాన్స్ లు సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా. అలియా భట్.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు..మొదటి సినిమాతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించింది. ఈ మూవీ తర్వాత హిందీలో వరుసబెట్టి అవకాశాలను అందుకుంటోంది. హిందిలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ లో నటించి మెప్పించింది ఈ చిన్నది. గంగూభాయి కతియావాడి సినిమాలో తన నటకు ఏకంగా జాతీయ అవార్డు వచ్చింది. రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీతో సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి పేరు సంపాదించుకుంది.

అయితే అలియా ఒక్కో సినిమాకు ఏకంగా 18కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అలాగే హార్ట్ ఆఫ్ స్టోన్ అనే హాలీవుడ్ సినిమా కోసం 500, 000డాలర్ల రెమ్యూనరేషన్ తీసుకుంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్ లోనూ నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తోంది. ఇక అలియాకు రూ. 550కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయట. కేవలం సినిమాలు మాత్రమే కాదు ఎండార్స్ మెంట్స్, బిజినెస్ వెంచర్స్ ద్వారా కూడా సంపాదిస్తోంది అలియా. అటు బిజినెస్ కూడా రాణిస్తోంది. చిన్న పిల్లల డ్రెస్సుల బ్రాండ్ ఎడ్ ఎ మమ్మను స్థాపించింది. ఈ బిజినెస్ విలువ 150కోట్లు ఉంటుందట. ముంబై, లండన్ లో భవనాలు, లగ్జరీ కార్లు, ఇలా ఈ అమ్మడి ఆస్తులు గురించి తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అందుకే పిల్లలు పుట్టిన ఈ బ్యూటీ జోరు ఏమాత్రం తగ్గలేదని అభిమానులు అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories