Actress: రాఘవేంద్ర హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా.? షాక్‌ అవ్వాల్సిందే..!

Do you Know how Raghavendra Heroine Shweta Agarwal Changed Now
x

Actress: రాఘవేంద్ర హీరోయిన్‌ ఇప్పుడెలా ఉందో తెలుసా.? షాక్‌ అవ్వాల్సిందే..!

Highlights

Actress: ప్రభాస్‌ హీరోగా వచ్చిన రాఘవేంద్ర సినిమా గురించి తెలిసే ఉంటుంది. కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయాన్ని అందుకోకపోయినా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను మాత్రం ఖుషీ చేసింది.

Actress: ప్రభాస్‌ హీరోగా వచ్చిన రాఘవేంద్ర సినిమా గురించి తెలిసే ఉంటుంది. కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయాన్ని అందుకోకపోయినా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ను మాత్రం ఖుషీ చేసింది. ప్రభాస్‌ రెండు విభిన్న వేరియషన్స్‌లో కనిపించిన ఈ సినిమా యావరేజ్‌ టాక్‌ సొంతం చేసుకున్నా వసూళ్ల విషయంలో పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు నటించిన విషయం తెలిసిందే.

రాఘవేంద్ర సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా నటించిన శ్వేత అగర్వాల్ గురించి తెలిసిందే. 'నమ్మిన నా మది మంత్రాలయమేరా' అనే పాటలో శ్వేత ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు గమ్యం మూవీలో స్పెషల్‌ సాంగ్‌తో పాటు, అల్లరి సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అయితే గమ్యం తర్వాత మళ్లీ శ్వేత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. 2008లో తందూరి అనే ఇంగ్లిష్‌ సినిమాలో నటించింది.

ఇక ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన శ్వేత.. 2020లో బాలీవుడ్ సింగర్ హోస్ట్ ఆదిత్య నారాయణను వివాహం చేసుకుంది. ఈ జంటకు ఒక పాప కూడా ఉంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ బ్యూటీ ప్రస్తుతం పూర్తి జీవితాన్ని కుటుంబంతోనే గడుపుతోంది. అయితే సినిమాల్లో నటించకపోయినా సోషల్‌ మీడియా ద్వారా మాత్రం అభిమాలనుతో నిత్యం టచ్‌లో ఉంటోంది. తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా.? అంటూ కొన్ని పోస్ట్‌లు నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories