రాజకీయాల గురించి ప్రశ్నలొద్దు: రిపోర్టర్ పై రజనీకాంత్ అసహనం

Do not ask political questions Rajinikanths absurd reply on Womens safety
x

రాజకీయాల గురించి ప్రశ్నలొద్దు: రిపోర్టర్ పై రజనీకాంత్ అసహనం

Highlights

కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌లో ఓ రిపోర్ట్‌‌పై అసహనం వ్యక్త చేయడం చర్చనీయాంశంగా మారింది.

కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్‌లో ఓ రిపోర్ట్‌‌పై అసహనం వ్యక్త చేయడం చర్చనీయాంశంగా మారింది. తన సినిమా కూలీ షూటింగ్ కోసం థాయిలాండ్ వెళ్తున్న రజనీకాంత్‌ను చెన్నై ఎయిర్ పోర్టులో మీడియా కొన్ని ప్రశ్నలు అడిగింది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన రజనీకాంత్ తన సినిమా అప్ డేట్ ను పంచుకున్నారు. అదే సమయంలో ఓ రిపోర్టర్ సమాజంలో మహిళల భద్రత గురించి ప్రశ్నించగా అసంబద్ధమైన ప్రశ్నలు వేయొద్దన్నారు. రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు తనను అడగొద్దని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

తన సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చిందని అడగగా 70 శాతం పూర్తయిందని చెప్పారు రజనీకాంత్. మిగతాది జనవరి 13 నుంచి 28 మధ్య షూటింగ్ చేస్తామన్నారు. ఇంతలో ఓ జర్నలిస్ట్ తమిళనాడులో మహిళా భద్రత గురించి ప్రశ్నించగా రజనీకాంత్ అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రశ్నలు అడగొద్దంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. గతేడాది జనవరి 23న అన్నా యూనివర్సిటీ క్యాంపస్ లో ఓ విద్యార్థినిపై లైంగిక వేధింపులు జరగడంతో తమిళనాడులో తీవ్ర కలకలం లేపింది. రాజకీయ దుమార లేపుతున్న సమయంలో ఈ అంశాన్ని రజనీకాంత్ ఎదుట మీడియా ప్రస్తావించింది. దీంతో అసంబద్దమైన ప్రశ్నలు వేయొద్దంటూ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.

లొకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కూలీ సినిమా తెరకెక్కుతోంది. రజనీకాంత్ కు ఇది 171వ సినిమా. వరుసగా ప్లాపుల నేపథ్యంలో ఈ సినిమా ఎలాగైన విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్న చిత్ర బృందం.. కీలక సన్నివేశాలు థాయిలాండ్‌లో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో రజనీకి జోడీగా శృతిహాసన్ నటిస్తుండగా నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories