Trivikram Home Banner : పలు స్టార్ హీరోల సినిమాల్లో లేదా బడా నిర్మాతల బ్యానర్ లో ఛాన్స్ లు ఇప్పిస్తామని అంటూ కొందరు మోసాలకి పాల్పడుతున్న సంగతి
Trivikram Home Banner : పలు స్టార్ హీరోల సినిమాల్లో లేదా బడా నిర్మాతల బ్యానర్ లో ఛాన్స్ లు ఇప్పిస్తామని అంటూ కొందరు మోసాలకి పాల్పడుతున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగా గతంలో గీతా ఆర్ట్స్ తీయబోతున్న సినిమాలు వెబ్ సిరీస్ ల్లో నటీనటులుగా ఛాన్స్ ఇప్పిస్తామంటూ కొందరు మోసాలకి పాల్పడినట్టుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపైన వెంటనే అప్రమత్తం అయిన గీతా ఆర్ట్స్ వాళ్ళు పోలీసులకి ఫిర్యాదు చేశారు..
ఇటీవల సింగర్ సునీత మేనల్లుడిని అంటూ ఆమె పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.. ఇది జరిగి కొన్ని రోజులు కాకముందే మరో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ హోం బ్యానర్ అయిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పేరుతో అవకాశలు ఇస్తామంటూ కొందరు మోసాలకు పాల్పడినట్టుగా తెలియడంతో ఆ సంస్థ వెంటనే అప్రమత్తం అయింది.
ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. మేము ఎలాంటి కాస్టింగ్ కాల్ ఇవ్వలేదు. మా కొత్త ప్రాజెక్ట్ ల కోసం కాస్టింగ్ కాల్ ప్రకటన చేసినట్లుగా కొందరు ప్రచారం చేసి అమాయకులను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అవేమి నమ్మకండి.. అప్డేట్స్ కోసం ఆఫీషియల్ వెబ్ సైట్ ను ఫాలో అవ్వండి అని వెల్లడించింది.
This is to clarify that we did not issue any casting call for any of our projects. Few imposters are trying to use our name to cheat innocent enthusiasts. Please don't believe in such fake messages. Wait for our official updates through proper channels, ONLY!
— Haarika & Hassine Creations (@haarikahassine) August 21, 2020
ఇక ఈ ఏడాది అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమాతో భారీ హిట్టు కోట్టిన ఈ సంస్ధ ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమాను చేస్తోంది. ఇది ఎన్టీఆర్ కి 30 వ సినిమా కావడం విశేషం.. దీనికి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మరో నిర్మాతగా వ్యవహరిస్తుంది.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా వచ్చింది. వచ్చే ఏడాది సమ్మర్లో సినిమాని విడుదల చేయనున్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire