Chitram 1.1: చిత్రం 1.1 లో హీరోగా ఎవరంటే...

Director Teja Introduces His Son as Hero in Chitram Sequel Movie
x

డైరెక్టర్ తేజ (ఫొటో ట్విట్టర్)

Highlights

Chitram 1.1: డైరెక్టర్ తేజ తన మొదటి సినిమా 'చిత్రం' తో సంచలనం క్రియోట్ చేసిన సంగతి తెలిసిందే.

Chitram 1.1: డైరెక్టర్ తేజ తన మొదటి సినిమా 'చిత్రం' తో సంచలనం క్రియోట్ చేసిన సంగతి తెలిసిందే. తొలి సినిమాతోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసి టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తేజ. ఈ చిత్రంతో ఉదయ్‌కిరణ్‌, రీమాసేన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఘన విజయం సాధించడంతో.. ఇద్దరూ స్టార్స్‌గా ఎదిగారు. ఈ చిత్రం అప్పట్లోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచి నిర్మాతలకు భారీగా కాసులు కురిపించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా `చిత్రం 1.1` సినిమా తీస్తున్నట్లు డైరెక్టర్ తేజ ప్రకటించిన సంగతి తెలిసిందే.

కాగా, ఈ సినిమాతో తేజ తన కొడుకు అమిత‌వ్ తేజని హీరోగా తెలుగు తెరకు పరిచయం చేయనున్నాడు. ఇందుకోసం విదేశాల్లో శిక్షణ కూడా ఇప్పించినట్లు టాక్ వినిపిస్తోంది. మరి అమితవ్‌ తేజకి ఈ సినిమా ఎలాంటి టర్న్‌ ఇస్తుందో చూడాలి. ఈనెల 18న షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories