స్టార్ హీరోతో శేఖర్ కమ్ముల సినిమా!

స్టార్ హీరోతో శేఖర్ కమ్ముల సినిమా!
x
Director Sekhar kammula(File photo)
Highlights

ఆనంద్ ఓ మంచి కాఫీ లాంటి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఆ తర్వాత హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఆనంద్ ఓ మంచి కాఫీ లాంటి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సెన్సిబుల్Director Shekhar next film with star hero.. ఆ తర్వాత హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఇక ఫిదా సినిమాతో నిజంగానే ఆడియన్స్ ని ఫిదా చేశాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా 'లవ్ స్టోరీ' అనే సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సినిమా పైన మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. ఈ సినిమాని సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. కానీ కరోనా వల్ల కుదరలేదు.

అయితే ఈ సినిమాకి ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉండగానే.. తన తర్వాతి సినిమాను కూడా ఫిక్స్ చేశాడు శేఖర్ కమ్ముల.. ఆ సినిమా కూడా ''లవ్ స్టోరీ'' సినిమాని తెరకెక్కిస్తున ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ ప్రొడక్షన్ లోనే కావడం విశేషం.. లవ్ స్టోరీ మూవీ కంటెంట్ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ కమ్ములనేచేయమని కోరగా దీనికి శేఖర్ కమ్ముల వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నాడని సమాచారం.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ని శేఖర్ కమ్ముల మొదలుపెట్టాడు. లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ మూవీ పట్టాలెక్కనుంది.

ఈ సినిమా కూడా శేఖ‌ర్ క‌మ్ముల‌ స్టైల్లోనే సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారాంగ్ నిర్మించనున్నారు.ఈ మూవీ గురించి మిగతా విషయాలు త్వరలో తెలియజేయనున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories