Nag Ashwin: తండ్రి చదువుకున్నా స్కూల్‌కు అండగా నిలిచిన నాగీ.. అదనపు గదుల నిర్మాణం కోసం

Director nag ashwin Donated RS 66 lakhs for govt school in his home village
x

Nag Ashwin: తండ్రి చదువుకున్నా స్కూల్‌కు అండగా నిలిచిన నాగీ.. అదనపు గదుల నిర్మాణం కోసం

Highlights

తొలి సినిమాతోనే సెన్సిబుల్ డైరెక్టర్‌తో పేరు తెచ్చుకున్నాడు. ఇక రెండో చిత్రం మహానటితో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఆమాటకొస్తే ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ మొత్తం నాగ అశ్విన్‌ గురించి చర్చించుకోవడం మొదలు పెట్టింది.

Nag Ashwin: నాగ అశ్విన్‌ ఇప్పుడు ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. కల్కి సినిమా ద్వారా ఒక్కసారిగా యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్నాడు. తొలి సినిమా ఎవడే సుబ్రమణ్యంతోనే డీసెంట్‌ హిట్‌ కొట్టిన నాగ అశ్విన్‌ మంచి మార్కులు కొట్టేశాడు. అంతకు ముందు శేఖర్‌ కమ్ముల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగ అశ్విన్‌ ఆ తర్వాత ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు.

తొలి సినిమాతోనే సెన్సిబుల్ డైరెక్టర్‌తో పేరు తెచ్చుకున్నాడు. ఇక రెండో చిత్రం మహానటితో ఒక్కసారిగా ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఆమాటకొస్తే ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ మొత్తం నాగ అశ్విన్‌ గురించి చర్చించుకోవడం మొదలు పెట్టింది. ముచ్చటగా మూడో చిత్రంతోనే ఏకంగా హాలీవుడ్ స్థాయికి ఎదిగాడు. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కించి కల్కి నాగ అశ్విన్‌ స్టమినా ఏంటో ప్రపంచాన్ని చూపించింది. ఒక అద్భుత ఊహా ప్రపంచాన్ని సృష్టించి ఔరా అనిపించుకున్నాడు.

ఇదిలా ఉంటే ఎంత ఎదిగినా ఒదిగే గుణం ఉన్న నాగ అశ్విన్‌ తాజాగా చేసిన ఓ పనికి ప్రశంసలు కురుస్తున్నాయి. తన తండ్రి చదువుకున్న పాఠశాల అభివృద్ధి కోసం తన వంతు సాయం అందించాడు నాగీ. నాగర్ కర్నూల్ జిల్లాలోని తన సొంతూరు ఐతోల్‌లో తన తాత సింగిరెడ్డి పర్వత్ రెడ్డి పేరుతో ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదులు నిర్మించి ఇచ్చాడు. తన తండ్రి చదువుకున్న ఈ స్కూల్‌కి తన వంతుగా ఈ సాయం చేసినట్లు పేర్కొన్నాడు.

పాఠశాలలో అదనపు గదుల నిర్మాణం కోసం ప్రస్తుతం రూ. 66 లక్షలు అందించినట్లు తెలుస్తోంది. అయితే భవిష్యత్తుల ఏదైనా అవసరం వస్తే మరింత చెల్లించడానికి తాను సిద్ధంగా ఉన్నానని నాగ అశ్విన్‌ చెప్పుకొచ్చారు. గదులు ప్రారంభోత్సవానికి తల్లిదండ్రులతో పాటు కలిసి పాల్గొన్నాడు నాగ్‌ అశ్విన్‌. దీంతో నాగీ చేసిన పనికి ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories