Director Maruthi : బాలీవుడ్ భామ అనుష్క శర్మ త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే.. గత నెల అనుష్క,
Director Maruthi : బాలీవుడ్ భామ అనుష్క శర్మ త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే.. గత నెల అనుష్క, విరాట్ తాము తల్లిదండ్రులు కాబోతున్నట్టుగా వెల్లడించారు. దీనితో అభిమానులతో పాటుగా సినీ సెలబ్రిటీలు వారిని విష్ చేశారు. అయితే తాజాగా అనుష్క మరో ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. 'నీలో మరో జీవితం ప్రాణం పోసుకోవడాన్ని ఆస్వాదించడానికంటే నిజమైంది, మధురమైంది మరొకటి ఉండదు. ఇది మన కంట్రోల్‌లో లేనప్పుడు ఇక ఏది ఉంటుంది..?' అంటూ అనుష్క శర్మ పోస్ట్ చేసింది.
అయితే ఈ పోస్ట్ కి ఓ మహిళా జర్నలిస్ట్ కౌంటర్ వేసింది. "అనుష్క గారు మిమ్మల్ని విరాట్ కోహ్లీ తల్లిని మాత్రమే చేశారు.. ఇంగ్లాండ్‌కి మహారాణిని చేయలేదు. మరీ అంతలా సంబరపడాల్సిన అవసరం లేదండీ" అంటూ కామెంట్ చేసింది. అయితే దీనిపైన దర్శకుడు మారుతి సీరియస్ గా స్పందించారు. "ఒక మహిళ జర్నలిస్ట్ అయిన మీరు ఇలాంటి కామెంట్స్ చేయడం బాధగా అనిపిస్తోంది. ఒక రాజ్యానికి రాణి కావడం కంటే బిడ్డకు తల్లి కావడమే మహిళకు గొప్ప విషయం. అవును ప్రతి మహిళ ఒక మహారాణే. సంతోషంతో నిండిన ప్రతి ఇల్లు కూడా గొప్ప సామ్రాజ్యమే. అనుష్క సెలబ్రిటీ కావడం కంటే ముందు ఓ సాధారణ మహిళ. తల్లి కాబోతున్న క్షణాలను ఆస్వాదించే హక్కు ఆమెకుంది" అంటూ మారుతి కామెంట్ చేశారు.
Disgraceful comments
— Director Maruthi (@DirectorMaruthi) September 14, 2020
That too frm a lady journalist :(
Motherhood is bigger joy than being queen of England
Yes every woman is a queen & every happy home is a kingdom
She's a normal human being too before being a celebrity & she has full right to be happy & flaunt her baby bump https://t.co/QnwX8Uzfy5
అటు అనుష్క శర్మ చేసిన ట్వీట్ పట్ల కోహ్లి అందమైన సమాధానం ఇచ్చాడు.. 'నా మొత్తం ప్రపంచం ఒక్క ఫ్రేమ్‌లో ఉంది' అంటూ హార్ట్ సింబల్ ని జతపరిచాడు విరాట్.. ఈ ట్వీట్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇక కోహ్లి, అనుష్క శర్మ ప్రేమించుకొని 2017లో ఇటలీలో వివాహం చేసుకున్నారు.. ప్రస్తుతం అనుష్క పలు సినిమాలతో వెబ్ సిరీస్ లతో బిజీగా ఉన్నారు.అటు కోహ్లి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) 2020 సీజన్ కోసం దుబాయ్ లో ఉన్నాడు.. కోహ్లి ఆర్‌సిబికి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.. సెప్టెంబరు 19 న ఐపిఎల్ మొదటి మ్యాచ్ జరగనుంది. సెప్టెంబర్ 21 న దుబాయ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో టోర్నమెంట్‌లో తొలి మ్యాచ్ ఆడనుంది ఆర్‌సిబి
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire