Harish Shankar: హీరోయిన్‌కు లేని ఇబ్బంది.. ట్రోలర్స్ కి ఎందుకు.? హరీష్ శంకర్ కామెంట్స్..

Director Harish Shanker Interesting Comments on Trollers About Age Gap Between Hero and Herione in Mr Bachchan Movie
x

Harish Shankar: హీరోయిన్‌కు లేని ఇబ్బంది.. ట్రోలర్స్ కి ఎందుకు.? హరీష్ శంకర్ కామెంట్స్..

Highlights

రవితేజ, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో విడుదల చేసిన సితార్, రెప్పల్ డప్పుల్ సాంగ్స్ఆకట్టుకున్నా ట్రోలింగ్స్ మాత్రం ఆగడం లేదు.

Harish Shankar: రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మిస్టర్ బచ్చన్. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రంలో రవితేజకు జోడిగా భాగ్య శ్రీ బోర్సే నటించింది. ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల అవుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ట్రోలింగ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. హీరో, హీరోయిన్ ల మధ్య వయసు వ్యత్యాసానికి సంబంధించి నెట్టింట ట్రోలర్స్ ఓ రేంజ్ లో ట్రోలింగ్స్ చేస్తున్నారు.

రవితేజ, భాగ్యశ్రీ బోర్సే కాంబోలో విడుదల చేసిన సితార్, రెప్పల్ డప్పుల్ సాంగ్స్ఆకట్టుకున్నా ట్రోలింగ్స్ మాత్రం ఆగడం లేదు. దీంతో ట్రోలర్స్ పై దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు. ఏజ్ గ్యాప్‌పై వస్తున్న వాదనలు నాకర్థం కావడం లేదంటూ హరీష్ శంకర్ అసహనం వ్యక్తం చేశారు.

ఓ ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నపుడు.. వాళ్లు చాలా విషయాలు చూస్తారు. కేవలం వయస్సు గ్యాప్ ఒక్కటే కాకుండా.. పెళ్లి కొడుకు కుటుంబ నేపథ్యం, జాతకంతోపాటు పలు విషయాలను ఆరా తీస్తారు. కానీ సినిమా విషయానికొస్తే.. మేం చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు.

యాక్టర్ ఎప్పుడూ తన వయస్సును బట్టి నటించడు. సినిమాలో 25 ఏండ్ల అమ్మాయిని కూడా 50 ఏండ్ల వ్యక్తి అని నమ్మించేలా చేయాల్సి వస్తుంది. ఇది నటన. అయితే స్క్రీన్పై వయస్సు అనేది కొంత ఉంటుంది. వయస్సు వ్యత్యాసంతో నటికి ఎలాంటి సమస్య ఉండదు. అందుకే ఆమె సినిమాకు సంతకం చేసింది. ఈ విషయంలో నటి సౌకర్యవంతంగా ఫీల్ అయినప్పుడు, కొంతమంది వయస్సు వ్యత్యాసం గురించి ఎందుకు బాధపడుతున్నారని ఆయన ప్రశ్నించారు.

సీనియర్ ఎన్టీఆర్, శ్రీదేవి చాలా సినిమాల్లో నటించి, మెప్పించారు. ఇక రవితేజ, శ్రీలీల నటించిన ధమాకాను కూడా ఓ ఉదాహరణగా చెబుతూ.. ఒకవేళ ధమాకా ఫెయిల్యూర్ అయితే.. టీం చిన్న వయస్సున్న అమ్మాయిని తీసుకోవడం వల్లే జరిగిందని ట్రోలర్స్ చెబుతారు. వారంతా ఇప్పుడు నిశ్శబ్ధంగా ఉన్నారు.. ఎందుకంటే భారీ హిట్ అయిందని ట్రోలింగ్స్ పై తనదైన శైలిలో స్పందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories