Sita Ramam Movie Climax: రామ్‌ పాత్రను ఎందుకు చంపాల్సి వచ్చింది.? హను లాజిక్‌ సూపర్‌ అసలు..

Sita Ramam Movie Climax
x

Sita Ramam Movie Climax

Highlights

Sita Ramam Movie Climax: హను రాఘవపూడి ఓ ఇంటర్వ్యూలో సీతారామం క్లైమాక్స్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

Sita Ramam Movie Climax: హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ జంటగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రేమ కథకు, యుద్ధాన్ని జోడించి హను రాఘవపూడి తెరకెక్కించిన దృశ్యకావ్యానికి ప్రేక్షకులను విపరీతంగా కనెక్ట్‌ అయ్యారు. ముఖ్యంగా ఎమోషనల్‌ సీన్స్‌కు ప్రేక్షకులు తెగ అట్రాక్ట్‌ అయ్యారు.

రామ్‌, సీతల మధ్య ప్రేమకు సంబంధించిన సన్నివేశాలను హను అద్భుతంగా తెరకెక్కించారు. అయితే సినిమా చివరిలో రామ్‌ పాత్ర మరణించడం అభిమానులను తీవ్ర నిరాశ పరిచిందని చెప్పాలి. థియేటర్ల నుంచి వచ్చేప్పుడు ప్రేక్షకులు బరువెక్కిన గుండెతో బయటకు వచ్చారు. రామ్‌, సీతను మళ్లీ కలిపితే బాగుండేదంటూ కొందరు అభిప్రాయపడ్డారు. సినిమా విడుదలైన సమయంలో సోషల్‌ మీడియాలో ఇందుకు సంబంధించి నెట్టింట కామెంట్లు సైతం చేశారు.

దీంతో తాజాగా ఈ కామెంట్స్‌పై దర్శకుడు హను రాఘవపూడి స్పందించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సీతారామం క్లైమాక్స్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా చివరిలో రామ్‌ పాత్ర చనిపోవడంపై స్పందిస్తూ.. సీతారాం మూవీకి మొదటిసారి కథ రాసిన దగ్గర నుంచి రామ్ పాత్రకు అది తప్ప వేరే ఆప్షన్ లేదన్న హను.. రామ్‌ ఎలా వస్తాడు.. వస్తే ఏం జరుగుతుంది.. సినిమా అయిపోతుంది. ఇక కథ అక్కడితో అయిపోతుందని చెప్పుకొచ్చారు.

'అయితే ఆ పాత్ర అక్కడితో ముగిసిపోతుంది. ఆ పాత్ర మీతో పాటు ఉండదు. అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా రామ్‌ను బతికించాలని నాతో ఫైట్ చేశారు. బతికిద్దామంటూ చాలా రోజులు నాతో వాదించారు. ఇన్ని కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చిన రామ్ చనిపోవడమేంటీ అని అనుకున్నారు. కానీ రామ్ అనే పాత్ర ఓ అద్భుతం. అలా అందరూ ఉండలేరు. అలాంటి తనను తిరిగి తీసుకువస్తే కేవలం అది ఓ క్యారెక్టర్ అయిపోతుంది. రామ్ మాములు వ్యక్తి అయిపోతాడు' అంటూ అద్భుతమైన లాజిక్‌ ఇచ్చాడు హను. నిజంగానే దర్శకుడు చెప్పిన లాజిక్‌ వింటే అద్భుతంగా ఉంది కదూ!


Show Full Article
Print Article
Next Story
More Stories