Dil Raju: ఆ బాధ్యత నాదే.. శ్రీతేజ్ ను పరామర్శించిన దిల్ రాజు..
రేవతి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజు(Dil Raju) చెప్పారు.
రేవతి కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్ దిల్ రాజు(Dil Raju) చెప్పారు. మంగళవారం కిమ్స్ ఆసుపత్రిలో (Kims hospital) చికిత్స పొందుతున్న శ్రీతేజ్(Sritej)ను ఆయన పరామర్శించారు.
బాధితుడి తండ్రి భాస్కర్ ను (Bhaskar)ఓదార్చారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరగడం బాధాకరమని ఆయన అన్నారు. రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్ ను కలిసి సంధ్యథియేటర్ ఘటనపై చర్చించనున్నట్టు ఆయన తెలిపారు. అల్లు అర్జున్ ను కూడా కలుస్తానని ఆయన వివరించారు. అమెరికా నుంచి రాత్రే తాను హైదరాబాద్ కు వచ్చానని ఇవాళ ఉదయం సీఎం ను కలిశానన్నారు.
సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి, సినీ పరిశ్రమ గురించి సీఎంతో చర్చించామన్నారు. తొక్కిసలాటలో మరణించిన రేవతి కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం, సిని పరిశ్రమ సిద్దంగా ఉన్నాయని ఆయన వివరించారు. ఈ బాధ్యతను తాను తీసుకుంటానని ఆయన చెప్పారు. భాస్కర్ కు ఇంట్రెస్ట్ ఉంటే ఆయనను సినీ పరిశ్రమలో పర్మినెంట్ ఉపాధి కల్పించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు.
సినీ పరిశ్రమను తెలంగాణ ప్రభుత్వం దూరం చేస్తోందని సాగుతున్న ప్రచారంపై కూడా ఆయన స్పందించారు. సినీ పరిశ్రమకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం హామీ ఇచ్చారని ఆయన వివరించారు. ఫిలిం ఇండస్ట్రీస్ నుంచి ప్రముఖులతో కలిసి సీఎంను రేపు లేదా ఎల్లుండి కలుస్తామన్నారు. ప్రభుత్వానికి, పరిశ్రమకు వారధిగా తాను పనిచేస్తానన్నారు. శ్రీతేజ్ రెండు రోజులుగా కోలుకుంటున్నారని వైద్యులు తనకు చెప్పారన్నారు.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire